హైకోర్టుకు అలా చెప్పడం సిగ్గుచేటు: అశ్వత్థామ రెడ్డి

హైకోర్టుకు అలా చెప్పడం సిగ్గుచేటు: అశ్వత్థామ రెడ్డి

Updated: Nov 1, 2019, 08:35 PM IST
హైకోర్టుకు అలా చెప్పడం సిగ్గుచేటు: అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ సందర్భంగా ఆర్టీసీ సంస్థకు బకాయి పడలేదని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు అని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు గణాంకాలతో కూడిన నివేదిక ఇచ్చిందన్న అశ్వత్థామ రెడ్డి... ప్రభుత్వం ఎలా చెబితే ఆర్టీసీ యాజమాన్యం అలా నడుచుకుంటోందని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం చెప్పిన నివేదికనే ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు ఇచ్చిందని అటు ప్రభుత్వంపై ఇటు సంస్థపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.