Weather forecast live: తెలంగాణ, ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు

Weather forecast live in telangana: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం నవంబర్ 18న దక్షిణ ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 10:57 PM IST
  • అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం
  • నవంబర్ 18న ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు
Weather forecast live: తెలంగాణ, ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు

Weather forecast live in telangana: హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల జల్లులు పడుతుండగా రానున్న మరో మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది.

అల్పపీడనానికి తోడుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్య అండమాన్ సముద్రంలో కొనసాగుతుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Also read : Pawan Kalyan: అప్పుడు ‘అమ్మ ఒడి' ఇప్పుడు ‘అమ్మకానికో బడి'.. ఏపీ ప్రభుత్వంపై పవన్ సెటైర్లు

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం నవంబర్ 18న దక్షిణ ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణంలో ఈ మార్పుల ప్రభావంతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, దక్షిణ చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు (Heavy rains in Telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also read : AP CM YS Jagan convoy వెంట పరుగెత్తిన మహిళ.. కారు ఆపిన సీఎం జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News