Vibrio Vulnificus: మనిషి మాంసాన్ని తినేస్తున్న కొత్త బ్యాక్టీరియా, అమెరికాలో కలకలం, 13 మంది మృతి

Vibrio Vulnificus: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం తేరుకుంటుందని సంతోషించేలోగా అగ్రరాజ్యం అమెరికా నుంచి  కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. అగ్రరాజ్యాన్ని ఇప్పుడు కొత్త బ్యాక్టీరియా తీవ్రంగా భయపెడుతోంది. శరీరంలో అవయవాల్ని తినేస్తున్న ఈ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2023, 06:11 AM IST
Vibrio Vulnificus: మనిషి మాంసాన్ని తినేస్తున్న కొత్త బ్యాక్టీరియా, అమెరికాలో కలకలం, 13 మంది మృతి

Vibrio Vulnificus: కరోనా మహమ్మారి శకం దాదాపుగా ముగిసింది. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కొద్దిగా భయపెడుతున్నా అంత తీవ్రత లేదని తెలుస్తోంది. అంయితే ఈసారి బ్యాక్టీరియా భయపెడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 13 మంది మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అమెరికాను ఇప్పుడు కొత్త, భయంకరమైన బ్యాక్టీరియా ఆందోళన రేపుతోంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త బ్యాక్టీరియా పేరు విబ్రియో వల్నిఫికస్. కొత్త బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కేసులు అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభంలో ఎలా వ్యాపించిందో అలానే ఇది వ్యాపిస్తోందని తెలుస్తోంది. పచ్చి మాంసం, ఉడకని మాసం తినడంతో ముందుగా చర్మంపై గాయాలు ఏర్పడుతున్నాయి. క్రమంగా జ్వరం, బీపీ, చర్మంపై బొబ్బలు ఏర్పడుతున్నాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ప్రాణాంతకం కాగలదంటున్నారు. 

అమెరికాలోని కనెక్టికట్, న్యూయార్క్, నార్త్ కరోలినా ప్రాంతంలో జూలై, ఆగస్టు నెలల్లో ఆరుగురు వ్యక్తులు ఈ కొత్త బ్యాక్టీరియా బారినపడ్డారు. విబ్రియో వల్నిఫికస్ అనేది చర్మ కణజాలాల్లో నెక్రోటైజింగ్ ఇన్‌ఫెక్షన్లు కలగజేస్తోంది. వరదలు, తుపాను వంటి వాతావరణ పరిస్థితులతో ఈ అంటువ్యాధి పెరుగుతోందని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

ఇతర దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం, సిరోసిస్, కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలుండేవారికి త్వరగా విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా వ్యాధి సోకుతోంది. మగవారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా శరీరంలో మాంసాన్ని తినేస్తుంది.  ఎక్కువగా ఉప్పునీటిలో లేదా ఉప్పునీరు, మంచి నీరు కలిసే ప్రాంతాల్లో కన్పిస్తుంది. 

Also read: Name Changed Countries: పేరు మార్చుకున్న దేశాల జాబితా ఇదిగో

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News