Corona Vaccine: నిన్న రష్యా...నేడు చైనా..వ్యాక్సిన్ కు ఆమోదం

రష్యా తరువాత ఇప్పుడు చైనా. కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) కు ఆమోదం పలకడం. చైనాలోని కాన్సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేసిన కాన్సినో వ్యాక్సిన్  ( Cansino vaccine ) కు చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసింది. అన్ని నిబంధనల మేరకు ఈ వ్యాక్సిన్ ఉండటం వల్లనే పేటెంట్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.

Last Updated : Aug 18, 2020, 09:39 PM IST
Corona Vaccine: నిన్న రష్యా...నేడు చైనా..వ్యాక్సిన్ కు ఆమోదం

రష్యా తరువాత ఇప్పుడు చైనా. కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) కు ఆమోదం పలకడం. చైనాలోని కాన్సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేసిన కాన్సినో వ్యాక్సిన్  ( Cansino vaccine ) కు చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసింది. అన్ని నిబంధనల మేరకు ఈ వ్యాక్సిన్ ఉండటం వల్లనే పేటెంట్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.

స్పుత్నిక్ వి ( Sputnik v ).   ప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు ( First corona vaccine ) తయారైన వ్యాక్సిన్. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ పై ఎన్ని సందేహాలున్నా సరే..రష్యా మాత్రం ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించేసింది. రష్యా తరువాత ఇప్పుడు చైనా తన దేశంలో తయారైన వ్యాక్సిన్ కు పేటెంట్ మంజూరు చేసింది ( China issued patent to cansino) . ఇప్పుడా వ్యాక్సిన్ కు సంబంధించిన మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. చైనాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ కాన్సినో బయోలాజికల్స్ ఈ వ్యాక్సిన్ ను అబివృద్ధి చేసింది. Also read: New Corona Virus: ఇది మరీ డేంజర్..తస్మాత్ జాగ్రత్త

అన్ని నిబంధనలు, వ్యాక్సిన్ ప్రోటోటైప్, బీజింగ్ ( Beijing )వైద్యాధికార్లు నిర్ణయించిన గైడ్ లైన్స్ ప్రకారం అధ్యయనాలు ఉన్నాయని రుజువవడంతోనే ఈ వ్యాక్సిన్ కు పేటెంట్ మంజూరు చేసినట్టు చైనా అధికారవర్గాలు తెలిపాయి. 

మార్చ్ నెలలో ఏడీ5 ఎన్ కొవ్ ( AD5N cov ) అనే చైనా వ్యాక్సిన్ ను పేటెంట్ ఆమోదం కోసం సమర్పించారు. జన్యుపదార్ధాల్ని మనిషి శరీరంలోట్రాన్సిట్ చేయడానికి, సంక్రమణను నివారించడానికి, ప్రతిరోధకాల్ని పెంచడానికి ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది. చైనాలో తయారు చేసిన 5 వ్యాక్సిన్ లలో ఈ వ్యాక్సిన్ సురక్షితమైందిగా అధ్యయనాలు సూచించాయి. పోస్ట్ ఫేజ్ 1, 2 లలో సానుకూలమైన రోగ నిరోధక శక్తి, టీ సెల్స్ ఉత్పత్తి స్థాయిని శాస్త్రవేత్తలు గమనించగలిగారు. వ్యాక్సిన్ భద్రత, సమర్ధత పూర్తిగా ఉందని చైనా అధికారవర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మూడోదశలో ఉన్న వ్యాక్సిన్ లు మూడున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా( oxford-astrazeneca ) , ఫైజర్-బయోన్టెక్ ( Pfizer-biontech ), మోడెర్నా ( Moderna ) వ్యాక్సిన్ లు. వాస్తవానికి చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసిన కాన్సినో వ్యాక్సిన్ ( Cansino vaccine ) ను చైనా అధికార్లు ఉపయోగించడానికి అత్యవసర అధికారాన్ని చైనా జూలైలోనే అనుమతిచ్చింది. Also read: Michelle Obama: ట్రంప్ ఓ అస‌మ‌ర్థ ప్రెసిడెంట్

Trending News