Donald Trump:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. అమెరికా చిరకాల ప్రత్యర్థి దేశమైన రష్యా అధ్యక్షుడితో ఫోన్ లో సంభాషించారు. అంతేకాదు ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది.ఫోర్లిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్.. వ్లాదిమర్ పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడినట్లు సదరు కథనం సారాంశం. ఐరోపాలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసినట్లు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం పై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు సమాచారం.
ట్రంప్ తానూ అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనన్నారు. దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. ఈ కాల్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా జెలెన్‌స్కీతో మాట్లాడారు.
ఇక, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు ఇటీవల పుతిన్ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఎన్నికల ఫలితాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన రష్యా అధినేత.. ట్రంప్ ధైర్యవంతుడు. ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ వాదనను గతంలో క్రెమ్లిన్ స్వాగతించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిణామాల వేళ తాజాగా వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter