US Couple Pet Cat: యూఎస్ లో వింత ఘటన.. అమెజాన్ రిటర్న్ బాక్స్ లో పెంపుడు పిల్లి.. ట్విస్ట్ ఏంటంటే..?

US Couple Pet Cat: యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాకు చెందిన ఒక జంట అనుకోకుండా తమ పెంపుడు పిల్లిని అమెజాన్ రిటర్న్ బాక్స్ లో ఉంచారు. ఆ తర్వాత దాన్ని గమంచలేదు. అమెజాన్ డెలివరీ బాయ్ ఆ బాక్స్ ను అలానే తీసుకుపోయాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 30, 2024, 03:49 PM IST
  • తమ పిల్లి కన్పించడంలేదంటూ గోడ మీద పోస్టులు..
  • ఆరురోజుల తర్వాత ఊహించని ఘటన..
US Couple Pet Cat: యూఎస్ లో వింత ఘటన.. అమెజాన్ రిటర్న్ బాక్స్ లో పెంపుడు పిల్లి.. ట్విస్ట్  ఏంటంటే..?

US Family reunited with pet cat after they accidentally show their amazon return box:  మనలో చాలా మంది కుక్కలు, పిల్లులను ఎంతో ప్రేమతో పెంచుకుంటారు.వాటిని తమ ఇళ్లలోని మనుషుల మాదిరిగా ట్రీట్ చేస్తారు. వాటికి మంచి ఫుడ్ ఇస్తుంటారు. రెగ్యులర్ గా వెటర్నరీ క్లినిక్ లకు కూడా తీసుకునిపోతుంటారు.ఒక్క నిముషం కూడా మూగ జీవాలను వదిలిపెట్టి అస్సలుఉండరు. అంతేకాకుండా.. ఎక్కడికి వెళ్లిన తమతో పాటే తీసుకెళ్తుంటారు.మూగ జీవాలు కూడా అదే విధంమైన బంధాన్ని తమ ఓనర్స్ తో కల్గి ఉంటాయి. తమ యజమాని కన్పించకుంటే ఆహారం తినేయడం మానేస్తాయి. ఇతరులు దగ్గరకు అస్సలు వెళ్లవు.

Read more: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

కొన్నిసార్లు మూగజీవాలు తప్పిపోయిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. అలాంటి సందర్బాలలో వాటి యజమానులు పోలీస్ లకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అంతేకాకుండా పోస్టులు కూడా పెడుతారు. తమ కుక్క లేదా పిల్లి ఆచూకీ చెబితే కొందరు నజరానా కూడా ఇస్తామంటూ అనేక పోస్టులు చేసిన ఘటనలు వార్తలలో చూశాం. తాజాగా,యూఎస్ కు చెందిన జంట తమ పెంపుడు పిల్లి కన్పించడంలేదంటూ సోషల్ మీడియా, తప్పి పోయిన ప్రాంతంలో పోస్టులు పెట్టారు.

పూర్తి వివరాలు.. 

యూఎస్ లోని ఒకజంట చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. క్యారీ క్లార్క్‌ జంట.. కొన్నేళ్లుగా గాలెనా అనే జాతీకి చెందిన పిల్లిని పెంచుకుంటున్నారు. దాన్ని ఇంట్లో వాళ్లలాగానే చూసుకుంటున్నారు. ఆ పిల్లి వాచ్చాక తమ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయంటూ, ఆ జంట భావిస్తుంటారు. అనేక ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యాయని భావిస్తారు. అయితే.. ఒక రోజు అనుకోని ఘటన జరిగింది. ఆ జంట ఏదో ఆలోచిస్తు, అమెజాన్ రిటర్న్ తీసుకెళ్లే బాక్స్ లో పిల్లిని ఉంచారు. ఇక డెలీవరీ బాయ్ వచ్చి ఆ బాక్స్ ను తీసుకెళ్లిపోయి వేర్ హౌస్ లో పెట్టేశాడు. తమపెంపుడు పిల్లి కన్పించకపోయేసరికి ఆ జంట తెగ టెన్షన్ పడ్డారు. ఆప్రాంతంలో ఉన్న వారందరిని ఆరాతీశారు. అంతేకాకుండా..పోస్టర్ లు చేసి గొడలకు కూడా అతికించారు.

ఈ క్రమంలో.. ఒకరోజు ఆరు రోజుల తర్వాత వారికి అమెజాన్ డెలీవరీ ఏజెంట్ నుంచి కాల్ వచ్చింది. వారి బాక్స్ లో ఒక పిల్లి ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో వారి ప్రాణాలు ఒక్కసారిగా లేచి వచ్చినట్లు భావించారు.వెంటనే అక్కడికి వెళ్లి తమ పిల్లిని తీసుకుని, వెటర్నరీ డాక్టర్ దగ్గరకుతీసుకెళ్లారు. ఆరు రోజులుగా ఎలాంటి ఆహారం లేకున్న కూడా  ఆపిల్లి అలానే ఉండటం పట్ల అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. తమ పిల్లి తమకు తిరిగి దొరికినందుకు ఆ జంట ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.  

Read More;Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

పిల్లి యజమాని, క్యారీ క్లార్క్, ఏప్రిల్ 10న తమ పెంపుడు పిల్లి మాయమైనట్లు కనుగొన్నారు. Ms క్లార్క్ కుటుంబం, స్నేహితుల సహాయంతో దాదాపు ఒక వారం పాటు వారి ఇల్లు మరియు పరిసరాలను వెతికినట్లు తెలిపారు. చివరకు .. ఏప్రిల్ 17న కాలిఫోర్నియాలోని అమెజాన్ వేర్‌హౌస్‌లో ఒక ఉద్యోగి ద్వారా గాలెనా అనే పిల్లి జాతి సురక్షితంగా,  ప్యాకేజీ లోపల బాగా ఉన్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో పిల్లి యజమాని.. గలెనా భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ఆమెకు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ పిల్లిని తెచ్చుకున్నాక కుదుటపడిందని, అప్పటి నుంచి పిల్లినిఎంతో ప్రేమగా పెంచుకునే వారమని మహిళ తెలిపింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News