Vijayawada GGH Corona: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో (vijayawada GGH) కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా విజయవాడ జీజీహెచ్‌లో 50 మందికి కరోనా పాజిటివ్ (Covid-19 Positive Cases) గా నిర్ధారణ అయింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా.. వైద్యులకు, సిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కరోనా బారిన పడుతుండటంతో..అధికారులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ (Night Curfew in AP) అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మాస్కు తప్పనిసరి చేశారు. ఏపీలో నిన్న 4,108 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కృష్ణా జిల్లాలో 170 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.
Also Read: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook