కరోనాపై ఆ మెస్సేజ్‌లు చేస్తే కేసులు నమోదు

కరోనా వైరస్ సోకిందని, లేకపోతే పలానా వాటి వల్ల కరోనా వస్తుందని మెస్సేజ్‌లు చేశారంటే కేసులు నమోదు చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.

Last Updated : Mar 6, 2020, 02:13 PM IST
కరోనాపై ఆ మెస్సేజ్‌లు చేస్తే కేసులు నమోదు

అమరావతి: తెలంగాణలో హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదైనప్పటి నుంచీ తెలుగు రాష్ట్రాల్లో దీనిపై వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఏపీలో పలానా చోట కరోనా వైరస్ వచ్చిందని, వారు జన సందోహం మధ్య తిరుగుతున్నారని కొందరు నెటిజన్లు దుష్ప్రచారం చేస్తుంటే, కరోనాతో ఇంత మంది చనిపోయారు జాగ్రత్త అంటూ మరికొందరు మెస్సెజ్‌లు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించి కరోనా వైరస్‌పై ప్రచారమవుతున్న వదంతులకు చెక్ పెట్టారు.

 రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

ఏపీలో ఇప్పటివరకూ ఒక్క కరోనా వైరస్ (COVID-19) కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కరోనా సోకిందంటూ లేనిపోని వదంతులు ప్రచారం చేసినట్లు గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రతిరోజూ ఏపీ వైద్యశాఖ కమిషనర్, ఆరోగ్య మంత్రిత్వశాకలు కరోనాపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా? 

వదంతులు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాపై అధికారులు, డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదని ఆయన సూచించారు.

అట్టహాసంగా రక్షిత 9 రోజుల పెళ్లి వేడుక.. ఫొటో గ్యాలరీ

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News