AP Politics: ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? సజ్జల వ్యాఖ్యలు దేనికీ సంకేతం..? వైసీపీ వ్యూహాం ఎలా ఉండబోతోంది..? ప్రతిపక్షాలు ఒక్కటవుతాయా..? లేక ఎవరికీ వారిగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చుతాయా..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది..? ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైనట్లు కనిపిస్తోంది. అధికార పార్టీతోపాటు విపక్షాలన్నీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాయి. పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నాయి. వైసీపీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ..పార్టీ బలోపేతం చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదికో..రెండేళ్లకో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని..ఐనా తమపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. ప్రతిపక్షాల గురించి పట్టించుకోవాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. వారు సింగిల్‌గా వచ్చినా..గుంపుగా వచ్చినా తమదే విజయమని తేల్చి చెప్పారు.
ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ప్రభుత్వం ముందస్తు వెళ్లే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన పార్టీలు ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయ ఢంకా మోగించింది. అదే ఫార్ములాను సీఎం జగన్ ఫాలో అవుతారని తెలుస్తోంది. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 2023లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇటు ప్రతిపక్షాలు సైతం జోరు పెంచాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముందు ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనను షూరు చేశారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నాయి. టార్గెట్ 100 అంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జనసేన సైతం దూకుడు పెంచింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..రైతు సమస్యలే ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోకి పోతున్నారు. జనసేన రైతుయాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా ప్రచారాన్ని మొదలు పెట్టింది. జిల్లాల వారిగా పార్టీ కార్యక్రమాలను చేపడుతోంది.
ఏపీలో మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇందులో మాత్రం పూర్తిగా భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా జనసేనకు సీట్లు పెరుగుతాయని వెల్లడిస్తున్నాయి. టీడీపీ(TDP)కి సైతం ఓట్ల శాతం పెరుగుతుందని చెబుతున్నాయి. అధికార పార్టీ వైసీపీకి మాత్రం షాక్ తగలబోతున్నాయని అంటున్నాయి. విపక్షాలన్నీ ఏకమైన ఆశ్చర్య పోవాల్సి అవసరం లేదని అంటున్నాయి. మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.
Also read:Sarkaru Vaari Paata: మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...
Also read:IPL 2022 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు వేళాయే.. నాకౌట్ బరిలో నిలిచే టీమ్స్ ఇవేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.