AP: ఆ పదాలపై పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి కొడాలి నాని

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వినూత్న విమర్శలు చేయాలంటే కొడాలి నాని తరువాతే ఎవరైనా. ఇప్పుడు మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.

Last Updated : Jan 18, 2021, 08:05 PM IST
AP: ఆ పదాలపై పేటెంట్ చంద్రబాబుదే: మంత్రి కొడాలి నాని

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వినూత్న విమర్శలు చేయాలంటే కొడాలి నాని తరువాతే ఎవరైనా. ఇప్పుడు మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.

ఏపీ ప్రతిపక్ష నేత ( Ap Opposition leader ) చంద్రబాబు ( Chandrababu )ను మంత్రి కొడాలి నాని ( Minister kodali nani ) ఆడుకున్నట్టు..విమర్శించినట్టు ఎవరూ చేయలేరు. ఈసారి చంద్రబాబుతో పాటు దేవినేని ఉమను టార్గెట్ చేశారు. చంద్రబాబు, సొల్లు ఉమ కలిసి..కోడిగుడ్డుకు ఈకలు పీకే పని ప్రారంభించారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రజల్ని వంచించేందుకు చంద్రబాబు కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. సొంత వదినను చంపి శాసనసభ్యుడైన వ్యక్తి దేవినేని ఉమ ( Devineni uma ) అని..అటువంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ( Chandrababu naidu ) బూట్లు నాకే వ్యక్తి..ఊసుపోక మీడియా ముందు సొల్లు కబుర్లు చెబితే చూస్తూ ఊరుకోమని...బడిత పూజ తప్పదన్నారు.  

మరోవైపు చంద్రబాబును ఉద్దేశించి ఈసారి మరి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. రాష్ట్రంలో జేబుదొంగ, వెన్నుపోటుదారుడు పదాలకు పేటెంట్ హక్కు అనేది చంద్రబాబుకే ఉందని..ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ( NTR ) మరణానికి కారణమైన దుర్మార్గుడే చంద్రబాబు అని కొడాలి నాని మండిపడ్డారు.   

లక్షలాదిమంది నిరుపేదల ఇంటి కలల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సాకారం చేశారని మంత్రి కొడాలి నాని ( Minister Kodali nani ) కొనియాడారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా సరే..ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్ అహర్నిశలూ పాటుపడుతున్నారని కీర్తించారు. 

Also read: NTR Vardhanthi: ఎన్టీఆర్‌పై ఆ ఐదుగురి కుట్ర..ఇదే సాక్ష్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News