Swarna Palace Fire Accident: మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం అందజేత

కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటంబాలకు రూ.50 లక్షల చొప్పున ( RS 50 Lakh To Vijayawada Swarna Palace victims family) ఏపీ మంత్రులు చెక్కులు అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇకనైనా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Last Updated : Aug 25, 2020, 05:07 PM IST
  • రెండు వారాల కిందట విజయవాడలో కోవిడ్ సెంటర్‌లో ప్రమాదం
  • స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ ప్రమాదంలో 10 మంది మరణం
  • చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.50 లక్షల పరిహారం అందజేత
Swarna Palace Fire Accident: మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం అందజేత

విజయవాడలోని ప్రైవేట్ కోవిడ్19 సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదం (Vijayawada Swarna Palace Fire Accident)లో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ మేరకు మృతుల కుటుంబసభ్యులకు ఏపీ మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌లు చెక్కులు మంగళవారం అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Sirigireddy Gangireddy: కరోనా భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య!

కాగా, రెండు వారాల కిందట రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తోన్న కోవిడ్ కేర్ సెంటర్‌ (COVID Care Centre)లో అగ్ని ప్రమాదం సంభవించి 10 చనిపోవడం తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్ నిర్వహిస్తోన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, హోటల్ యజమాని శ్రీనివాస్ బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. Dope Tests: ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు డోపింగ్ పరీక్షలు 
 
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్ 
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్

Trending News