Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నిండిన కంపార్ట్మెంట్లు.. సర్వదర్శనానికి 24 గంటలు..

Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. బుధవారం స్వామివారి దర్శనానికి 14 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2023, 09:01 AM IST
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నిండిన కంపార్ట్మెంట్లు.. సర్వదర్శనానికి 24 గంటలు..

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతుంది. 14 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి చూస్తున్నారు. నిన్న స్వామి వారిని 70,789 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం హుండీ కానుకల ద్వారా 4.13 కోట్ల రూపాయలు వచ్చింది. శ్రీనివాసుడకి 21,215 మంది తలనీలాలు సమర్పించారు. 

శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు పండితులు. దీనిలో భాగంగా.. ఇవాళ ప్రత్యూషకాల పూజతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు..బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో శ్రీవారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించారు. అనంతరం నవనీత హారతి సమర్పించారు. బుధవారం స్వామివారికి నైవేద్యంగా బెల్లం పాయసంను సమర్పించారు. ప్రతి బుధవారం నిర్వహించే సహస్రకళషాభిషేకాన్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు.  సంవత్సరానికొకసారి సర్కారు వారి సహస్రకళషాభిషేకం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది.

నేటి మధ్యాహ్నాం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను అర్చకులు జరపనున్నారు. అనంతరం అద్దాల మండపంలో డోలోత్సవం సేవను ఏర్పాటు చేస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకారసేవ  కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరుపుతారు. తర్వాత తిరు ఉత్సవం జరుపుతారు. రాత్రి కైంకర్యాల్లో‌ భాగంగా తోమాల, అర్చన, గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. చివరిగా శ్రీవారికి ఏకాంత సేవను నిర్వహించి ముగిస్తారు.

Also Read: Mercury transit: కేవలం 13 రోజుల్లో ఆ మూడు రాశులకు మారిపోనున్న దశ, ఊహించని ధనలాభం, అన్నింటా విజయమే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News