రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

Updated: Oct 7, 2018, 09:12 AM IST
రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

రాగల24 గంటల్లో ఏపీలో వర్షాలు పడవచ్చని విశాఖపట్టణం వాతావరణ శాఖ విభాగం అధికారులు  పేర్కొన్నారు.  నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చివరి దశకు చేరుకుందని, శనివారం కోస్తాలోని మచిలీపట్నం, రాయలసీమలోని కర్నూలు నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయని పేర్కొన్నారు. సోమవారం నాటికి దక్షిణాది నుంచి నైరుతి పూర్తిగా వెళ్లిపోయి.. ఈశాన్య రుతుపవనాలు రావడం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

సోమవారం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

రెడ్ అలర్ట్ ఉపసంహరణ

మరోవైపు వాతావరణ శాఖ తమిళనాడుకు ఇచ్చిన రెడ్ అలర్ట్ ప్రకటనను ఉపసంహరించుకుంది. శనివారం తీవ్రత తగ్గడం, ఎండ రావడంతో.. అల్పపీడనం  దిశ మార్చుకోవడం, తుపాను ఓమన్‌ తీరం వైపు మళ్లడంతో రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికలను ఉపసంహరించుకుంటున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈశాన్య రుతుపవనాల రాక, మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తమిళనాడులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించాయి. అటు కేరళ, పుదుచ్చేరిలలో కూడా గత రెండుమూడ్రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.