Chandrababu Oath Ceremony Live: ముగిసిన చంద్రబాబు కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవం.. పూర్తి లిస్ట్ ఇదే..!

CM Chandrababu Swearing-in Ceremony Live Updates: చంద్రబాబు నాయుడు పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. మంత్రివర్గ కూర్పు కూడా పూర్తవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 12, 2024, 12:39 PM IST
Chandrababu Oath Ceremony Live: ముగిసిన చంద్రబాబు కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవం.. పూర్తి లిస్ట్ ఇదే..!
Live Blog

CM Chandrababu Oath Ceremony Live Updates: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మంత్రివర్గ కూర్పు కూడా పూర్తవ్వడంతో చంద్రబాబుతోపాటు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కేబినెట్‌లో ఎనిమిది మంది బీసీలు, 17 మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. మొత్తం 24 మంది మంత్రులు ఉండనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1978లో 28 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు.. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు చేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. చంద్రబాబు పట్టాభిషేకం లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో చేయండి.

 

 

12 June, 2024

  • 12:39 PM

    ప్రమాణ స్వీకారంలో హైలెట్ సీన్

     

     

  • 12:29 PM

    Chandrababu Oath Ceremony Live: ఏపీ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయింది. చంద్రబాబుతోపాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

  • 12:25 PM

    Mandipalli Ramprasad Reddy As Minister: రాష్ట్ర మంత్రిగా రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:24 PM

    Kondapalli Srinivas As Minister: రాష్ట్ర మంత్రిగా గణపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:22 PM

    Vasamsetti Subhash As Minister: రాష్ట్ర మంత్రిగా రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 12:20 PM

    S.Savitha As Minister: రాష్ట్ర మంత్రిగా పెనుగొండ ఎమ్మెల్యే ఎస్.సవిత ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:17 PM

    TG Bharath As Minister: రాష్ట్ర మంత్రిగా కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:16 PM

    BC Janardhan Reddy As Minister: రాష్ట్ర మంత్రిగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:14 PM

    Gummadi Sandhya Rani As Minister: రాష్ట్ర మంత్రిగా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సుధారాణి ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 12:11 PM

    Kandula Durgesh As Minister: రాష్ట్ర మంత్రిగా నిడదవోలు జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 12:09 PM

    Gottipati Ravi Kumar As Minister: రాష్ట్ర మంత్రిగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:08 PM

    Dola Sree Bala Veeranjaneya Swamy As Minister: రాష్ట్ర మంత్రిగా కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:05 PM

    Kolusu Parthasarathy As Minister: రాష్ట్ర మంత్రిగా నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ప్రమాణ స్వీకారం చేశారు.

  • 12:03 PM

    Anagani Satya Prasad As Minister: రాష్ట్ర మంత్రిగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 12:02 PM

    Payyavula Keshav As Minister: రాష్ట్ర మంత్రిగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 12:00 PM

    Anam Ramanarayana Reddy As Minister: రాష్ట్ర మంత్రిగా ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 11:57 AM

    N. M. D. Farooq As Minister: రాష్ట్ర మంత్రిగా నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎమ్‌డీ ఫరూక్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:55 AM

    Nimmala Rama Naidu As Minister: రాష్ట్ర మంత్రిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:54 AM

    Sathya Kumar Yadav As Minister: రాష్ట్ర మంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:52 AM

    Vangalapudi Anitha As Minister: రాష్ట్ర మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత వంగలపూడి ప్రమాణ స్వీకారం చేశారు.
     

  • 11:50 AM

    Punganur Narayana As Minister: రాష్ట్ర మంత్రిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:47 AM

    Nadendla Manohar As Minister: రాష్ట్ర మంత్రిగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:46 AM

    Kollu Ravindra As Minister: రాష్ట్ర మంత్రిగా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్ల రవీంద్ర ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:44 AM

    Kinjarapu Atchannaidu As Minister: రాష్ట్ర మంత్రిగా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:41 AM

    Nara Lokesh As Minister: రాష్ట్ర మంత్రిగా మంగళగిరి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:39 AM

    Pawan Kalyan As Minister: రాష్ట్ర మంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:38 AM

    Chandrababu Swearing-in ceremony Live News: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

  • 11:16 AM
  • 11:10 AM

    Chandrababu Swearing-in ceremony Live News: సభా వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

  • 11:08 AM

    Chandrababu Swearing-in ceremony Live News: వేదికపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ సభా వేదికగా ఆశీనులయ్యారు.

  • 10:59 AM

    Chandrababu Swearing-in ceremony Live News: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ రోజు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి  ఏపీ సహా విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎంగా.. ప్రతిపక్ష నేతగా ఓ రికార్డు నెలకొల్పారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 10:57 AM

    Chandrababu Swearing-in Ceremony Live News: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. సభా వేదికపైకి వచ్చి అందరినీ పలకరించారు. 

  • 10:49 AM

    Chandrababu Naidu Oath Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పాస్‌లు ఉన్న  వాహనాలనే సభా ప్రాంగణం వైపు పోలీసులు అనుమతిస్తున్నారు.

  • 10:41 AM

    AP Cabinet Oath Ceremony Live Updates: విజయవాడలోని ప్రైవేట్ హోటల్ నుంచి గన్నవరం సమీపంలోని కేసరపల్లి నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు.

  • 10:32 AM

    AP Cabinet Oath Ceremony Live Updates: మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. చిరంజీవితోపాటు పలువురు సినీతారలు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 10:27 AM

    AP Cabinet Oath Ceremony Live Updates: మంత్రుల జాబితా ఇదే..
    1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు)
    2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)  
    3. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
    4. నాదెండ్ల మనోహర్ (కమ్మ)
    5. పి.నారాయణ (కాపు)  
    6. వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
    7. సత్యకుమార్ యాదవ్  (బీసీ, యాదవ)
    8. నిమ్మల రామానాయుడు (కాపు) 
    9. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
    10. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
    11. పయ్యావుల కేశవ్ (కమ్మ) 
    12. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
    13. కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ)
    14. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల)
    15. గొట్టిపాటి రవి (కమ్మ) 
    16.  కందుల దుర్గేష్ (కాపు) 
    17. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 
    18. బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి)
    19. టీజీ భరత్ (ఆర్య వైశ్య)
    20. ఎస్.సవితమ్మ (కురబ)
    21. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
    22. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
    23. మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
    24. నారా లోకేష్ (కమ్మ)

  • 10:25 AM

    Chandrababu Naidu Oath Ceremony Live Updates: చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జితన్ రామ్ మంజి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరుకానున్నారు.

Trending News