Pawan Kalyan: ఒకే ఫ్రేములో మెగాస్టార్, పవర్ స్టార్ లతో ప్రధాని.. ప్రమాణ స్వీకారోత్సవంలో బాబుకు మోడీ గట్టి షాక్..

Pawan Kalyan: తాజాగా జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైనే బాబుకు మోడీ గట్టి షాక్ ఇచ్చారు.  మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ వేదికపై ఉన్న అందరినీ ఆప్యాయంగా పలకించారు. ఈ నేపథ్యంలో అన్నాదమ్ములైన మెగాస్టార్, పవర్ స్టార్ లతో కలిసి వేదికపై చేతులెత్తి అభివాదం చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 12, 2024, 02:56 PM IST
Pawan Kalyan: ఒకే ఫ్రేములో మెగాస్టార్, పవర్ స్టార్ లతో ప్రధాని.. ప్రమాణ స్వీకారోత్సవంలో బాబుకు మోడీ గట్టి షాక్..

Pawan Kalyan: ఈ రోజు చంద్రబాబు నాయుడు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. గత ఐదేళ్లలో ఎన్నో కష్టానష్టాలను ఓర్చి తిరిగి స్వాధీనమైన అధికారంతో తెలుగు దేశం శ్రేణులతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నాయి. మొత్తంగా 175 సీట్లలో 164 సీట్లలో విజయం సాధించి చరిత్రలో కనీవినీ ఎరగని విజయాన్ని నమోదు చేసారు. ఈ రోజు జరిగిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అథితిగా హాజరై  కూటమి నేతలతో పాటు పార్టీ శ్రేణులను ఉత్సాహా పరిచారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేరుగా ప్రమాణ స్వీకారం చేసే స్థభాస్థలికి చేరుకున్నారు.

ముందుగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ .. చంద్రబాబు నాయుడుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెంనాయుడు సహా మిగిలిన 24 మంత్రులు వరుసగా ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాన మంత్రిపై వేదికపై ఉన్న తన కేబినేట్ సహచరులతో పాటు ఎన్డీయే పక్ష నేతలను పలకరించారు. ఈ సందర్బంగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్, చిరంజీవిలను వేదికపై తీసుకొచ్చి పైకి చేతులెత్తి అభివాదం చేసారు. ఈ సందర్బంగా కూటమి విజయంతో పాటు  పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవిలపై అనుకున్న ఆప్యాయతను  నరేంద్ర మోడీ అలా చాటుకున్నారు.

మరోవైపు ఏపీలో ఉన్న రెండు బలమైన పార్టీలు ఒక్కో సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చేరువ అయ్యేందుకు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కు చెందిన మెగా ఫ్యామిలీని ఏపీలో ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారతోత్సవంలో మెగాస్టార్, పవర్ స్టార్ లతో నరేంద్ర మోడీ కలిసి అభివాదం చేయడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా వేదికపై చంద్రబాబుకు మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.  

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News