Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ టాప్, లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్రం

Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక కోర్టు ధిక్కారణ కేసులు ఏపీలో ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నా..ఇది ముమ్మాటికీ నిజం. సాక్షాత్తూ కేంద్రం వెల్లడించిన విషయమిది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 16, 2022, 08:53 PM IST
Contempt of court: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ టాప్, లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్రం

ఏపీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కారణ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో ఏకంగా 350 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు ఓ ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

ఏపీలో గత మూడేళ్లుగా అంటే 2019 నుంచి కోర్టు ధిక్కరణ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వివిధ కేసుల్లో, వివిధ సందర్భాల్లో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడంలో విఫలం కావడంతో నమోదైన కేసులివి. కోర్టు ధిక్కరణ కేసులు విపరీతంగా పెరగడం ఓ ప్రమాదకర స్థితిని సూచిస్తుంది. 

లోక్‌సభలో కేంద్రం ఏం చెప్పింది

కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలో అత్యధికంగా ఉన్నాయని, దేశంలో అత్యదికంగా ఏపీలోనే ఈ కేసులున్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా వివరాలు అందించింది. ఏడు రాష్ట్రాల్లో మొత్తం 28,469 కోర్టు ధిక్కరణ కేసులుండగా, ఒక్క ఏపీలోనే 11 వేలకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఏపీలో 11,348 కేసులుంటే..తెలంగాణలో 6,236 కేసులున్నాయి. ఇక రాజస్థాన్, కర్ణాటక, కోల్‌కతా, పాట్నా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో కూడా కోర్టు దిక్కరణ కేసులు ఎక్కువగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో కలిపి మొత్తం 16,42,371 రిట్ పిటీషన్‌లు పెండింగులో ఉన్నాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది. న్యాయస్థానాల్లో పెండింగు కేసుల సంఖ్య పెరిగిపోవడంపై ఇటీవల కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన వివరాలివి. 

Also read: YSRCP vs TDP: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News