టీడీపీ పార్టీ నాలుగు రోజులు వేచి చూడాలనే ధోరణిలో ఉంది. పార్లమెంట్ నాలుగు పనిదినాల్లో కేంద్రం బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై స్పందిస్తుందని టీడీపీ ఆశిస్తోందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి వై. సుజనా చౌదరి ఎంపీల సమావేశం అనంతరం విజయవాడలో చెప్పారు.
చౌదరి అభిప్రాయం ప్రకారం, పార్లమెంటులో ఏపీ ప్రయోజనాల కోసం ఎంపీలందరూ తమ గళాన్ని గట్టిగా వినిపించాలని కోరారు. కేంద్రం వైఖరి చూసి బీజేపీతో కలిసి ఉండాలా? వద్దా? అనేది ఆలోచిద్దామని సీఎం అన్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు నాయుడితో మాట్లాడారా? అని ప్రశ్నిస్తే.. సమాధానం దాటవేశారు.
పార్టీ ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకోదు అని వై.సుజనా చౌదరి పీటీఐతో అన్నారు. "ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన సమస్యలపై టీడీపీ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది. డిమాండ్లను నెరవేర్చకపోతే, నిరసనలు చేస్తాం" అని చౌదరి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.
వేచి చూద్దాం.. తప్పకపోతే పోరుబాటే..!