Divvela Madhuri: దివ్వెల మాధురీకి మరో బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. ఆందోళనలో దువ్వాడ..?..అసలేం జరిగిందంటే..?

Divvela Madhuri controversy: దివ్వేల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల తిరుమలకు వెళ్లి అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. అంతటితో ఆగకుండా తిరుమాడ వీధుల్లో ఫోటోలు దిగుతూ రెచ్చిపోయారు.  ఇది కాస్త వివాదంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 20, 2024, 12:52 PM IST
  • తిరుమలలో రీల్స్..
  • దివ్వెల చుట్టు తిరుగుతున్న వివాదాలు..
Divvela Madhuri: దివ్వెల మాధురీకి మరో బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. ఆందోళనలో దువ్వాడ..?..అసలేం జరిగిందంటే..?

Divvela Madhuri and duvvada Srinivas controversy: టెక్కలీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల వరుసగా వివాదాల్లో ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన సతీమణి, కూతురు .. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు బైఠాయించి రచ్చ చేశారు. అంతేకాకుండా.. కొన్ని రోజుల పాటు ఈ సీన్ ఏపీలో తెగ హల్ చల్ గా మారింది.  మరోవైపు కొంత మంది పెద్దలు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.

కానీ చివరకు వీరి వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.అయితే.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ.. అక్టోబరు 7 వ తేదీన తిరుమలకు వెళ్లారు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత బైటకు వచ్చి మాడ వీధుల్లో ఫోటోలు దిగుతూ, రీల్స్ చేసుకుంటూ హల్ చల్ చేశారు. దీంతో ఇది కాస్త వివాదస్పదంగా మారింది.  

దీనిపై కొంతమంది శ్రీవారి భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు దివ్వెల మాధురీపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈక్రమంలో పోలీసులు దివ్వెల మాధురీపై  bns 292, 296, 300 సెక్షన్ 66 -200-2008 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల పొలీసులు శ్రీకాకుళం జిల్లా, టెక్కలి చేరుకొని మాధురికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. దీనిపై దివ్వెల మాధురీ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్బలంతోనే తమపై కేసులు పెట్టారని కూడా ఫైర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ డైవర్స్ తీసుకొకుండా.. మూడో భార్యకు కడుపు చేశారని కూడా దివ్వెల మాధురీ మాట్లాడటం వివాదస్పదంగా మారింది . తాము ఇద్దరం ఇష్టప్రకారమే కలిసి ఉంటున్నామని, కోర్టులో కేసు పరిష్కారం కాగానే పెళ్లి చేసుకుంటామని కూడా దివ్వెల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు.

Read more: Visakha Sri Saradapeetham: శారదా పీఠానికి బిగ్ షాక్.. ఆ అనుమతులు చెల్లవంటూ ఆదేశాలు.. అసలేం జరిగిదంటే..?

కొంత  మంది కావాలని తమను వివాదాల్లోకి లాగుతున్నారంటూ కూడా దివ్వెల మాధురీ ఆందోలన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకమని, ఆయనను దర్శించుకునేందుకు వస్తే.. ఇలా వివాదస్పదం చేస్తారని అనుకోలేదన్నారు. ఏది ఏమైన తమకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని, చట్ట ప్రకారం దీనిపై  ముందుకు వెళ్తామని కూడా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాదురీ వెల్లడించినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News