భారీ వర్షాలతో చెరువులు పొంగిపోర్లాయి. నదుల ప్రవాహం పెరిగి గ్రామాలకు గ్రామాలకు వరద ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో కోవిడ్19 పేషెంట్‌ను పడవలో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది ఎక్కడో కాదండోయ్.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఇది జరిగింది. కరోనా బాధితుడిని పడవలో తీసుకెళ్తుంటే స్థానికులకు వింతగా అనిపించింది. కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్‌ను పడవలో తరలించాల్సి వచ్చింది. Plasma Therapy: ఎట్టకేలకు అమెరికాలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
#WATCH Andhra Pradesh: Police in Doddavaram village of East Godavari district used a boat to take a #COVID19 patient to hospital, as the village is flooded following rainfall in the region. The boat was arranged by a Sub-Inspector of Nagaram village of the district. (23.08.2020) pic.twitter.com/g5aiOeFM5p
— ANI (@ANI) August 23, 2020
దొడ్డవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సిబ్బంది వచ్చారు. గ్రామం మొత్తం వరదనీటితో జలమయం కావడంతో నగరం సబ్ ఇన్‌స్పెక్టర్ పడవ సౌకర్యాన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ కరోనా బాధితుడిని ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు పడవలో గ్రామం నుంచి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్
JEE మెయిన్స్, NEET హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి