Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం రేటు.. మహిళలకు పెద్ద గుడ్ న్యూస్‌

మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుంటే.. 3 రోజుల నుండి కాస్త దిగి వస్తున్న రేట్లు వినియోగదారులకు ఉపశమనం అందిస్తున్నాయి. ఇవాళ్టి బంగారం మరియు వెండి ధరల వివరాలు ఇలా.. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2023, 07:05 PM IST
Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం రేటు.. మహిళలకు పెద్ద గుడ్ న్యూస్‌

Gold Rate: ఒకప్పుడు బంగారంపై జనాల్లో ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. రెండు దశాబ్దాల క్రితం బంగారం రేటు పది వేల లోపు ఉండేది. అప్పుడు బంగారం విక్రయాలు తక్కువగా ఉండేది. ఎప్పుడైతే బంగారం యొక్క వినియోగం విపరీతంగా పెరిగిందో అప్పటి నుండి కూడా బంగారం యొక్క రేటు విపరీతంగా పెరుగుతూ వచ్చింది. పదుల రెట్లు రేటు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ. 61,000 కాగా.. ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ ధర రూ.56,000 లుగా ఉంది. 

ఇక వెండి ధర కిలో రూ. 78,000 లుగా ఉంది. ఆల్ టైమ్ హై కి చేరుకున్న బంగారం ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. పెరిగిన స్థాయిలో దిగి రాకున్నా కూడా వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరలు దిగడం మహిళలకు ఆనందాన్ని కలిగించే విషయం. 

గురువారం హైదరాబాద్‌ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. సాధారణంగా ఆభరణాలకు వినియోగించే బంగారం రేటు 10 గ్రాములకు గాను రూ.56,300 నుండి 200 రూపాయలు తగ్గి రూ.56,100 లకి చేరుకుంది. ఈ మధ్య కాలంలో ఒకే సారి రెండు వందల రూపాయలు తగ్గడం అంటే అరుదుగా చూస్తూ ఉన్నాం. 

వందలకు వందలు రేటు పెరుగుతూ పదుల రూపాయలు తగ్గుతూ ఉన్న బంగారం ఈసారి వరుసగా మూడు రోజులుగా తగ్గడం మాత్రమే కాకుండా నేడు ఏకంగా రెండు వందలు తగ్గడం జరిగింది. హైదరాబాద్‌ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల్లో అయిదు పది రూపాయలు కాస్త అటు ఇటుగా బంగారం రేటు ఉన్నట్లుగా మార్కెట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కాస్త రేటు తగ్గడంతో వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా మార్కెట్‌ పరిశీలకులు చెబుతున్నారు. 

Also Read: BRO Movie: ఆసక్తికరంగా పవన్‌ కల్యాణ్‌-సాయి తేజ్‌ మూవీ టైటిల్‌.. స్టైలిష్‌ లుక్‌లో పవర్‌స్టార్‌!   

ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. గురువారం కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గి రూ.78,200 నుంచి రూ.78,100 లకు చేరుకుంది. హైదరాబాద్ లో మాదిరిగానే వరంగల్.. ఖమ్మం.. విశాఖపట్నం.. తిరుపతిలో కూడా అదే రేటుకు వెండి అమ్మకాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం నవంబర్‌ లో 22 క్యారెట్ గోల్డ్ రూ.46100 ఉండేది. ఆరు నెలల కాలంలో పది వేల రూపాయలు పెరిగింది. 

ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితిని చూస్తూ ఉంటే రాబోయే ఆరు నెలల్లో మరో పది వేల రూపాయలు పెరిగే అవకాశాలు లేకపోలేదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది మొత్తంలో బంగారం రేటు తగ్గినా పెరిగే సమయంలో మాత్రం ఎక్కవ మొత్తంలో పెరుగుతుంది. కనుక మరోసారి ఆల్‌ టైమ్‌ హై ని బంగారం రేటు టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Also Read: Sofia Ansari On Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బూతు ఫోటోలు, వీడియోలు.. తగ్గేదెలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News