Amritsar-Singapore Flight: ఎయిర్‌లైన్స్ లోపాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం 50 మంది ప్రయాణికులను మర్చిపోయి వెళ్లిపోయిన విషయం మరువకముందే.. అదే తరహాలో స్కూట్ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. 35 మంది ప్రయాణికులను అమృత్‌సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.
ఏం జరిగిందంటే..?
స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం సాయంత్రం 7:55 గంటలకు అమృత్‌సర్ నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ విమానం మధ్యాహ్నం 3 గంటలకే బయలుదేరి వెళ్లిపోయింది. ప్రయాణ సమయానికి 5 గంటల ముందే వెళ్లిపోవడంతో 35 మంది ప్రయాణికులు ఫ్లైట్ మిస్ అయ్యారు. దీంతో వారందరూ విమానాశ్రయంలోనే నిరసనకు దిగారు. ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎయిర్‌లైన్ సిబ్బంది స్పందిస్తూ.. టేకాఫ్ సమయం గురించి ప్రయాణికులందరికీ ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చామని చెప్పారు.
అమృత్‌సర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ వెళ్లాల్సిన విమానం 280 మంది ప్రయాణికులతో వెళ్లాల్సి ఉందన్నారు. రీషెడ్యూల్ అవ్వడంతో 250 మంది ప్రయాణికులతో వెళ్లిపోయిందని చెప్పారు. దాదాపు 30 మంది ప్రయాణికులు మిగిలిపోయారని చెప్పారు. అయితే 35 మంది ప్రయాణికులు ఒకే ట్రావెల్ ఏజెంట్ వద్ద టికెట్స్ బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఫ్లైట్ టైమ్ మారిన విషయం ఆ ఏజెంట్ వీరికి చెప్పకపోవడంతో.. వారందరూ ఫ్లైట్ మిస్ అయ్యారని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు.
ఇటీవల కూడా..
జనవరి 10న ప్రయాణికులను వదిలిపెట్టి బెంగళూరు నుంచి ఢిల్లీకి గోఫస్ట్ విమానం బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ విమానం 50 మందికి పైగా ప్రయాణికులను వదిలి బయలుదేరింది. ప్రయాణికులు రన్‌వేపై బస్సులో ఉండగా.. విమానం టేకాఫ్ అయి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఈ ఘటనపై గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు కూడా చెప్పింది. వారందరికీ సంవత్సరంలో ఒకసారి దేశంలో ఎక్కడికైనా ఉచితంగా ఫ్లైట్ జర్నీ చేసే ఆఫర్ కూడా ఇచ్చింది.
Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్
Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook