Nellore Murder Case: కొందరికి విజ్ఞానాన్ని పంచుతుంటే మరికొందరికి దొంగతనాలు ఎలా చేయాలి..? ఎలా తప్పించుకోవాలో తెలిపే వీడియోలు కొందరిని నేరస్ధులుగా అడుగులు వేసేందుకు దోహదపడుతున్నాయి. ఇదే కోవలో నెల్లూరు జిల్లా కావలిలో ఓ యువకుడు యూట్యూబ్ వీడియోలు చూసి వృద్ధురాలిని హత్య చేశాడు. అనంతరం బంగారం ఎత్తుకుని పరార్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేయగా.. యూట్యూబ్ వీడియోలు చూసి హత్య ఎలా చేయాలో నేర్చుకున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోయారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కావలి జనతాపేటలో మంచాల భారతి, మాల్యాద్రి రిటైర్ ఎంప్లాయూస్. భారతి అమ్మ మంచాల రమణమ్మ వారి వద్దే ఉంటున్నారు. వీరికి సహాయుకుడుగా వరప్రసాద్ అనే యువకుడిని పనిలో పెట్టుకున్నారు. వారితో నమ్మకంతో ఉన్నట్లు నటిస్తూ.. ఇంట్లో బంగారంపై కన్నేశాడు వరప్రసాద్. రోజులాగానే భారతి, మాల్యాద్రి ఉదయం వాంకింగ్ కోసం గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో వచ్చిన వరప్రసాద్.. మంచాల రమణమ్మ (85)ను సుత్తితో తలపై కొట్టాడు. ఆమె సృహతప్పిపోగా ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసి బయలకు వెళ్లిపోయాడు.
కూతురు భారతి, అల్లుడు మాల్యాద్రి వాకింగ్ ముగించుకొని ఇంటికి రాగా.. రమణమ్మ మంచంపై ఉండడంతో నిద్రపోతుందని అనుకున్నారు. హత్య చేసి బయటకు వెళ్లిపోయిన వరప్రసాద్.. ఎలాంటి అనుమానం రాకూడదని తిరిగి వాళ్లకు టిఫిన్ తీసుకువచ్చి.. మళ్లీ వెళ్లిపోయాడు. అయితే ఎంతకు రమణమ్మ నిద్రలోని నుంచి లేవకపోవడంతో కూతురు భారతి గమనించి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి.. అనుమానంతో చాకచక్యంగా వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
యూట్యూబ్ వీడియోలు చూసి హత్య నేరానికి పాల్పడినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వివరాలను వెల్లడించారు. వరప్రసాద్‌ను అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి రూ.లక్షా 65 వేలు విలువ చేసే ఐదు సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని.. కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook