Cricket Match Fight: దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్‌కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
Sports Car Accident: రోడ్లపై కార్లతో దూసుకెళ్తుండడంతో ఇతర వాహనదారులు ప్రయాణించాలంటే బెంబేలెత్తే పరిస్థితి ఎదురైంది. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బౌన్సర్‌ను ఢీకొట్టారు. తాజాగా సరదాగా బైక్‌పై వచ్చిన అన్నాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టి అంతటితో ఆగకుండా దూసుకెళ్లింది.
Noida Youtuber Death News: మద్యం మత్తులో స్నేహితులే ఓ యూట్యూబర్‌ను కర్రలతో దాడి చేసి హత్య చేశారు. పార్టీలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు హత్యకు దారి తీసింది. గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
BJP Leader Ranjith Sreenivasan Murder Case: బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మందికి మరణ శిక్షను ఖరారు చేసింది కేరళ అలప్పుజ కోర్టు. కేరళ చరిత్రలో ఒకేసారి 15 మందికి మరణశిక్షను విధించడం సంచలన రేకిత్తిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్‌కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Palghar Train Accident: సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో పనులు చేస్తుండగా ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ రైలు దూసుకొచ్చింది. అనుకోకుండా జరిగిన సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Uttar Pradesh Crime: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ గర్భం దాల్చగా.. రెండుసార్లు అబార్షన్ మాత్రలు మింగించి.. మళ్లీ అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Tirupati Car Accident: తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో కారు దూసుకెళ్లడంతో ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Anakapalle Family Suicide: అనకాపల్లిలో అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మరణించగా.. ఓ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Sarpanch Husband Died: నెల్లూరు జిల్లాలో జరిగిన భూవివాదంలో సర్పంచ్ కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి చేయగా.. సర్పంచ్ భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
America Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబసభ్యులు ఐదుగురు మరణించారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా టెక్సాస్ బంధువుల ఇంటికి వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. వివరాలు ఇలా..
Uttar Pradesh Crime News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. టీ ఆలస్యం చేసిన భార్యను కత్తితో కిరాతంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Road Accident in Tamil Nadu: తమిళనాడులో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం తిగిరి కారులో వస్తుండగా.. తమిళనాడులోని తేని జిల్లాలో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
UP BJP MLA Rape Case: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. తొమ్మిదేళ్ల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఈ కేసులో ఎమ్మెల్యే దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. పూర్తి వివరాలు ఇలా..
Cyber Crime in Bengaluru: ఓఎల్ఎక్స్లో బెడ్ అమ్మేందుకు ప్రయత్నించి.. సైబర్ వలకు చిక్కాడు ఓ టెక్కీ. ఆన్లైన్ కేటుగాడి మాటలు నమ్మి.. తన అకౌంట్లో ఉన్న రూ.68 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Siddipet Collector Gunman Suicide News: సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆర్థిక కారణాలా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అని పోలీసులు విచారిస్తున్నారు.
Vizag Indus Hospital Fire Accident: విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్లు తెలుస్తుండగా.. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.
Vijay Devarakonda Defamation: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. కాగా విజయ దేవరకొండ పైన ఒక వ్యక్తి అసభ్యకర వార్తలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయగా.. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకున్నారు పోలీసులు…
Woman Paraded Naked in Karanataka: కొడుకు ప్రేమించిన యువతితో పారిపోవడంతో యువకుడి తల్లిని నగ్నంగా ఊరేగించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆమెను వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.