Mokshagna's debut: మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీపై Balakrishna ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Mokshagna's film debut: బాలయ్య బాబు తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఫిలిం ఎంట్రీ ఇవ్వనున్నాడు అనేది గత కొన్నేళ్లుగా ఫిలిం నగర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2021, 04:05 PM IST
Mokshagna's debut: మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీపై Balakrishna ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Mokshagna's film debut: బాలయ్య బాబు తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఫిలిం ఎంట్రీ ఇవ్వనున్నాడు అనేది గత కొన్నేళ్లుగా ఫిలిం నగర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా (Sequel to Aditya 369) తెరకెక్కనున్న ఆదిత్య 999 సినిమాతో బాలయ్య బాబుతో కలిసి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడని అప్పట్లో ఓ టాక్ బలంగా వినిపించింది. అయితే, ఏ కారణాల వల్లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మళ్లీ మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీపై కూడా అంతగా టాక్ వినిపించలేదు.

అయితే, తాజాగా తన బర్త్ డే వేడుకల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ... మోక్షజ్ఞ సినీ పరిచయం గురించి చెప్పుకొచ్చారు. ఆదిత్య 999 ప్రాజెక్టు అటకెక్కలేదని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ జరుగుతోందని స్పష్టంచేశారు. ఆదిత్య 999 మూవీ (Aditya 999 movie) ద్వారానే మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ ఉండబోతుందని బాలయ్య బాబు తేల్చిచెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ (NTR) తనని ఎలాగైతే సినిమాల్లోకి పరిచయం చేశారో.. అదే తరహాలో తాను కూడా మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకొస్తానని బాలయ్య బాబు తెలిపారు.

Also read : HBD Balakrishna: బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ వెల్లువ, యువరాజ్, చిరంజీవి, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు

మోక్షజ్ఞను (Mokshagna) పరిచయం చేస్తున్న ఆదిత్య 999 తప్పితే మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేసే ఉద్దేశం లేదని బాలయ్య బాబు వెల్లడించారు. మోక్షజ్ఞకు తానేంటో నిరూపించుకోవడానికి ఆ ఒక్క సినిమా చాలు అన్నట్టు బాలయ్య బాబు (Balakrishna birthday celebrations) వ్యాఖ్యానించారు.

Also read : Bimbisara: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీకి NTR వాయిస్

Trending News