Bigg Boss Kaushal Father : తండ్రి కోసం కొత్త ఇళ్లు.. కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ కౌశల్

Bigg Boss Kaushal Father బిగ్ బాస్ షోలో కౌశల్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఎన్నో స్ట్రాటజీలు వాడేశాడు. చివరకు కౌశల్ విన్నర్‌గా నిలిచాడు. అలా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎన్నో కాంట్రవర్సీల్లో చిక్కుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 08:35 PM IST
  • బిగ్ బాస్ కౌశల్ కొత్త ఇళ్లు
  • తండ్రి కోసం స్పెషల్‌ హోమ్
  • కల నెరవేరిందన్న బిగ్ బాస్ విన్నర్
Bigg Boss Kaushal Father : తండ్రి కోసం కొత్త ఇళ్లు.. కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ కౌశల్

Bigg Boss Kaushal New Home To Father బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తండ్రి సుందరయ్య బుల్లితెరపై ఫేమస్ నటుడన్న సంగతి తెలిసిందే. కౌశల్ ఇప్పుడు తన తండ్రి కోసం గొప్ప పని చేశాడు. ఓ కొడుకుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. కౌశల్ తనకు జన్మనిచ్చిన తండ్రి కోసం ఓ ఇంటిని కట్టించాడు. దానికి సంబంధించిన గృహ ప్రవేశం కూడా జరిపించాడు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda)

ఎవరికైనా సరే తన తండ్రి ఫస్ట్ హీరో అవుతాడు. అలాంటి రియల్ లైఫ్ హీరో, తన తండ్రికి కౌశల్‌ గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. నా తండ్రి నాకు జన్మను ఇచ్చాడు.. అలాంటి తండ్రికి మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ఇలా రుణం తీర్చుకున్నాను.. లవ్యూ డ్యాడ్ అంటూ కౌశల్‌ తన పర్సనల్ ఫోటోలను షేర్ చేశాడు. ఇందులో తన భార్య, పిల్లలు, తండ్రి అందరూ కనిపిస్తున్నారు.

బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్‌గా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే. విన్నర్ అయ్యేందుకు కౌశల్ ఎంచుకున్న మార్గం తప్పని తరువాత అందరూ అన్నారు. ఆటలో ఎలా గెలిచాం అనేది కాదు.. గెలిచామా? లేదా? అన్నది ముఖ్యమని కౌశల్ ఆర్మీ అంటుంది. అలా కౌశల్ బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచాడు కానీ తోటి కంటెస్టెంట్లకు మాత్రం దగ్గర కాలేకపోయాడు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కౌశల్ చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టు ముట్టాయో అందరికీ తెలిసిందే. తనది తాను ఎన్నో గొప్పలు చెప్పుకుని మీడియా ముఖంగా తోక ముడిచాడు కౌశల్. ఇక కౌశల్‌కు సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ కూడా అతని కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. ఇప్పుడు బుల్లితెరపై కౌశల్ బీబీ జోడి అంటూ రచ్చ చేస్తున్నాడు.

కౌశల్‌ ఆర్మీ, కౌశల్‌కు ఉన్న క్రేజ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ప్రత్యేకం. ఇంత వరకు ఆరు సీజన్లు జరిగినా కూడా రెండో సీజన్, అందులో కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలా కౌశల్ బిగ్ బాస్ షో మీద తనదైన ముద్ర వేసి రికార్డులు క్రియేట్ చేశాడు.

Also Read:  vinaro bhagyamu vishnu katha Review : వినరో భాగ్యము విష్ణు కథ రివ్యూ.. కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడోచ్

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News