Committee Kurrollu Movie Review: నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ మెప్పించారా.. సినిమా ఎలా ఉందంటే.. !

Committee Kurrollu Movie Review: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెర ముందు కాదు.. తెర వెనక నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తుంది. తాజాగా ఈమె ‘కమిటీ కుర్రోళ్లు’ అనే డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 9, 2024, 09:57 AM IST
Committee Kurrollu Movie Review: నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ మెప్పించారా.. సినిమా ఎలా ఉందంటే.. !

సినిమా : కమిటీ కుర్రోళ్లు

నటీనటులు:సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా,సాయికుమార్, మణికంఠ పరశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరణ్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, తేజస్వీ రావు, షణ్ముకి, రాధ్య, టీనా శ్రావ్య, విశిక, తదితరులు

ఎడిటింగ్: అన్వర్ అలీ

సినిమాటోగ్రఫీ: ఎడిరోలు రాజు

సంగీతం: అనుదీప్ దేవ్

నిర్మాతలు: నిహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక

దర్శకత్వం: యదు వంశీ

విడుదల తేది: 9-8-2024

నిహారిక కొణిదెల నటిగానే నిర్మాతగా సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ కోవలో ఈమె పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై యదు వంశీ దర్శకత్వంలో ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా నిర్మించింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా.. లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

గోదావరి జిల్లాలోని ఓ కుగ్రామంలో పుష్కరానికి అంటే 12 యేళ్లకు ఒకసారి జాతర జరగుతూ ఉంటుంది. అయితే.. ఈ సారి జాతర తర్వాత పది రోజులకు ఊర్లో ఎన్నికలు ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లో కమిటీ కుర్రాళ్లలో ఒకడైన శివ (సందీప్ సరోజ్) ఊరి సర్పంచ్ పదవి కోసం పోటీలో దిగుతాడు. ఈ నేపథ్యంలో స్నేహితుల మధ్య కులాలు, రిజర్వేషన్లు చిచ్చు రగులుతుంది. ఈ నేపథ్యంలో కులాల చిచ్చు మధ్య నలిగిన ఈ కుర్రాళ్లు ఎలా ఆ ఉచ్చు నుంచి ఎలా బయటపడ్డారు. ఈ క్రమంలో ఈ ఊర్లో పెద్ద మనిషి అయిన పోలిశెట్టి బుజ్జి (సాయికుమార్) పాత్ర ఏమిటి ?  అసలు స్నేహితులు మధ్య చిచ్చు ఎవరు రగిల్చారు ? చివరకు వీరు కలుసుకున్నారా ? లేదా అనేదే ‘కమిటీ కుర్రాళ్లు’ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

‘రంగస్థలం’ సినిమా తర్వాత తెలుగులో 80, 90ల కాలం నాటి సినిమాలు తెరకెక్కించడానికి దర్శకులు ముందుకు వస్తున్నారు. ఆనాటి నేపథ్యంలో దర్శకుడు యదు వంశీ ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాను తెరకెక్కించాడు. ఒకే ఊర్లో ఉండే స్నేహితులు కులాలు మరిచిపోయి కలివిడిగా ఉండటం.. వాళ్లు మధ్య కులాల చిచ్చు రగుల్చే కొంత మంది మనుషులు.. ఆ కారణంగా స్నేహితులు విడిపోవడం వంటివి తెరపై చక్కగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు యదు వంశీ మంచి మార్కులే కొట్టేసాడు. మొబైల్స్ లేని కాలంలో మనుషుల మధ్య స్నేహాన్ని.. అప్పట్లో కుర్రాళ్లు హాలీవుడ్ సినిమాల్లోనీ సీన్స్ కోసం వీడియో క్యాసెట్లు, సీడీల కోసం ఎగబటడం వంటివి ఆనాటి కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లాడు.

ముఖ్యంగా ఊర్లో జరిగే జాతరలు.. అందులో కుర్రాళ్లు ఎలా బిహేవ్ చేస్తారనేది చక్కగా అల్లు కొన్నాడు. అంతేకాదు అక్కడక్కడ చిలిపి కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కొన్ని సన్నివేశాల్లో స్నేహం కోసం దేనికైనా వెనకాడని కల్మషం లేని స్నేహితులు. వీరి స్నేహాన్ని చూసి సహించని కొంత మంది వారిని విభిజించు పాలించు తరహాలో వీరి మధ్య కులాల చిచ్చు వంటివి సహజంగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు తాను రాసుకున్న  కథను తెరపై చక్కగా ప్రెజెంట్ చేసాడు. ప్రస్తుతం సమాజాంలో కులాల పేరుతో రాజకీయ పార్టీలు చేస్తోన్న రచ్చను గుర్తుకు తెస్తుంది. మొత్తంగా తొలి ప్రయత్నంలో యదు వంశీ మంచి మార్కులు కొట్టేసాడు. దర్శకుడిగా ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది. సినిమాటోగ్రఫీ ఆనాటి కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ఎడిటర్ సెకాండాఫ్ కాస్త ల్యాగ్ చేసినట్టు కనిపిస్తోంది. అనుదీప్ ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
అంతా కొత్త కుర్రాళ్లు నటించిన ఈ సినిమాలో అందరు తెరపై మంచి భావోద్వేగాలు పలికించారు. కొత్తవాళ్లు చేసినట్టుగా కాకుండా.. పక్కింటి తెలిసిన కుర్రాళ్లు ఎలా చేస్తారో అలానే ఈ సినిమాలో వీళ్ల యాక్టింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. వీళ్లకు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి నటీనటులు అవుతారు. సాయి కుమార్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ యాక్టింగ్ భావోద్వేగానికి గురి చేస్తోంది.

ప్లస్ పాయింట్స్

కథ

ఫస్టాప్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

కొత్త నటీనటులు కావడం

సెకాండాఫ్ ల్యాగ్

పంచ్ లైన్.. ‘కమిటీ కుర్రోళ్లు’ అదరగొట్టేసారు

రేటింగ్: 3/5

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News