Aarambham: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అదిరిపోయే థ్రిల్లర్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి!

Aarambham OTT: కేరాఫ్ కంచరపాలెం ఫేమ్.. నటుడు మోహన్ భగత్ ఇప్పుడు ఆరంభం అనే సినిమాతో.. ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో విడుదల అయింది. థియేటర్లలో చూడటం మిస్ అయిన ప్రేక్షకులు..అందరూ ఇప్పుడు మాత్రం సినిమాని ఎగబడి చూస్తున్నారు.

Written by - Vishnupriya | Last Updated : Jul 6, 2024, 08:48 AM IST
Aarambham: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అదిరిపోయే థ్రిల్లర్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి!

Recent OTT Releases: మోహన్ భగత్ కేరాఫ్ కంచరపాలెం సినిమాతో.. ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మోహన్.. తాజాగా ఇప్పుడు ఆరంభం అనే ఒక త్రిల్లర్ సినిమాలో నటించారు. ఆ సినిమా ఇప్పుడు చాలా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. 

Add Zee News as a Preferred Source

వివరాల్లోకి వెళితే.. ఆరంభం అనేది ఒక టైం ట్రావెల్ థ్రిల్లర్ కథ. ప్రతిక్షణం ఏం జరుగుతుందో.. అన్న ఆసక్తి ప్రేక్షకులలో కలిగిస్తుంది. టైమ్ ట్రావెల్.. డెజావు.. ఈ రెండు కాన్సెప్ట్ లను చాలా బాగా బ్లెండ్ చేసి డైరెక్టర్ ఈ కథని రాసుకోవడం మాత్రమే కాక మన ముందుకి చాలా బాగా తీసుకొచ్చారు.

ప్రతి సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది. అనే ఉత్కంఠ సినిమా ఆద్యంతం ప్రేక్షకులలో ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది.

సినిమా కథ గురించి చెప్పాలంటే కాలాఘటి అని జైలు నుంచి ఖైదీ నెంబర్ 299.. అనే వ్యక్తి తప్పించుకుంటాడు. కానీ అతను తప్పించుకున్నాడు అనడానికి ఎటువంటి.. ఆధారాలు ఉండవు. అసలు ఆ మిస్టీరియస్ ఎస్కేప్ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉంటారు. 

ఈ కేస్ ని చేదించడానికి డిటెక్టివ్ కూడా రంగంలోకి దిగుతారు. వారి పరిశోధనల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. అవి ఏంటి? అసలు ఆ ఖైదీ ఏమయ్యాడు? ఇలా తప్పించుకున్నాడు? చివరికి ఏమైంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని అసలు మిస్ అవ్వకండి. 

మోహన్ భగత్ తో పాటు.. సుప్రీత సత్యనారాయణ, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. 

అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అభిషేక్ వి తిరుమలేష్ AVT ఎంటర్టైన్మెంట్ పతాకం పై నిర్మించారు. సింజిత్ యర్రమిల్లి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. సందీప్ అంగడి సినిమాకి డైలాగ్స్ అందించారు.

 

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more: Bhole baba Properties: వామ్మో.. భోలే బాబాకు అన్ని కోట్ల ఆస్తులు, కళ్లు చెదిరే బంగ్లాలున్నాయా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News