సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే దుర్వార్త యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కానీ లేదా ఆయన కుటుంబసభ్యులతో కానీ బాగా సాన్నిహిత్యం కలిగిన సినీ ప్రముఖులు షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. నందమూరి హరికృష్ణతో నాగార్జునకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందులోనూ 1999లో సీతారామ రాజు అనే సినిమాలో ఈ ఇద్దరు హీరోలు అన్నాదమ్ముళ్ల పాత్రలో నటించారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అంతేకాకుండా ఇవాళ నాగ్ పుట్టిన రోజు కూడా. ఈ నేపథ్యంలోనే నందమూరి హరికృష్ణ ఇలా అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై నాగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
"కొన్ని వారాల క్రితం తనకు ఫోన్ చేసిన నందమూరి హరికృష్ణ అన్నయ్య.. 'చాలారోజులైంది నిన్ను చూసి.. కలవాలి తమ్ముడు' అని అన్నారు. కానీ కలిసే అవకాశం లేకుండానే అన్నయ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అని నాగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అన్న లేని లోటు పూడ్చలేనిది. మిస్ యూ అన్న" అని నాగ్ ట్వీట్ చేశారు.
చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు..that’s what he said a few weeks ago and now he is gone.all I feel is a void,I will miss you Anna!!!! pic.twitter.com/T9epx3ZEEk
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2018