NBK@50Years: నట వారసుల్లో బాలకృష్ణ వరల్డ్ రికార్డు.. ప్రపంచ సినీ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్..

NBK@50Years: నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 50 యేళ్ల క్రితం ఈయన హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగష్టు 30న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినీ వారసుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 30, 2024, 01:05 AM IST
NBK@50Years: నట వారసుల్లో బాలకృష్ణ వరల్డ్ రికార్డు..  ప్రపంచ సినీ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్..

NBK@50Years:నందమూరి బాలకృష్ణ ప్రపంచ సినీ చరిత్రలో ఓ నట వారసుడిగా అడుగుపెట్టి 50 యేళ్లుగా హీరోగా కొనసాగుతున్నవాళ్లు ఎవరు లేరు. ఈ రకంగా నట వారసుల్లో హీరోగా ఇప్పటికీ ఇరగదీస్తోన్న నటులు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు లేరు.  అంతేకాదు నట వారసుల్లో సుధీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకున్న తొలి నటుడిగా కూడా రికార్డు నమోదు చేసారు.  50 యేళ్ల సినీ కెరీర్ లో విజయానికి పొంగిపోకుండా.. అపజయానికి కృంగిపోకుండా  తన పని చేసుకుంటూ పోతున్నారు బాలయ్య. అంతేకాదు ఎమ్మెల్యేగా.. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవ తారకం దంపతులకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఎన్టీఆర్ దంపతులకు ఆరో కుమారుడు. అంతేకాదు 14 యేళ్ల చిన్నఏజ్ లో ఎన్టీఆర్ నిర్మిస్తూ,  దర్శకత్వం వహించిన‘తాతమ్మ కల’ మూవీతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఏ ముహూర్తానా.. ముఖానికి రంగేసుకున్నాడో ఏమో ఇప్పటికీ అప్రహతంగా నటుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు.

50 యేళ్ల సినీ ప్రస్థానంలో ఎక్కువగా టైటిల్ రోల్స్ పోషించడం విశేషం. 50 యేళ్ల నట ప్రస్థానంలో చారిత్రక, పౌరాణిక, సోషియో ఫాంటసీ,సైన్స్ ఫిక్షన్, జానపద, సోషల్ మూవీస్ లో నటించడం విశేషం. తన తరంలో ఇన్ని జానర్స్ లో హీరోగా నటించిన వ్యక్తి ఎవరు లేరు.

నందమూరి బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాద్ లో గడిచింది. తండ్రి ఎన్టీఆర్  కోరిక మేరకు నిజాం కాలేజిలో డిగ్రీ పూర్తి చేస్తూనే నటుడిగా సినీ కెరీర్ కొనసాగించారు. సోలో హీరోగా బాలయ్య మొదటి చిత్రం ‘సాహసమే జీవితం’. హీరోగా తొలి సక్సెస్ అందుకున్న చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. అంతేకాదు ఈ సినిమా నందమూరి నట సింహం కెరీర్ లో తొలి వంద రోజులు.. తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంతో పాటు.. తొలి గోల్డెన్ జూబ్లీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.      

అంతేకాదు బాలయ్య దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటించారు.కథానాయకుడిగా విజయశాంతితో ఎక్కువ చిత్రాల్లో నటించారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఒకే రోజు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు వంటి చిత్రాలను రిలీజ్ చేసి సంచలనం రేపారు బాలయ్య.

అంతేకాదు ‘తాతమ్మ కల’ నుంచి ‘మహారథి’ సినిమా వరకు  మొత్తం గా10 సినిమాల్లో తన సొంత పేరు బాలకృష్ణతో నటించడం విశేషం.
ఇక అపూర్వ సహోదరులు నుంచి  వీరసింహా రెడ్డి వరకు  మొత్తంగా 18 చిత్రాల్లో ఎక్కువ డ్యూయల్ రోల్స్ పోషించిన బాలకృష్ణ. తన తరంలో ఇన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన హీరో ఎవరు లేరు. 1986లో డబుల్ హాట్రిక్ సాధించిన బాలయ్య.. రీసెంట్ గా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, భగవంత్ కేసరి’ సినిమాలతో హాట్రిక్ విజయాలు అందుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేగా మూడు సార్లు హిందూపుర్ నుంచి టీడీపీ తరుపున గెలిచారు.మొత్తంగా 50 యేళ్ల సినీ కెరీర్ లో బాలయ్య ఎన్నఅద్భుత విజయాలను అందుకున్నారు. అంతేకాదు 50 యేళ్లలో ఓటీటీ వేదికగా యాంకర్ అవతారం ఎత్తారు. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు. అంతేకాదు 60 యేళ్ల తర్వాత వరుసగా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

Trending News