Nayanthara Blessed With Twins : నయనతారకు ట్విన్స్.. ముందే జాతకం చెప్పిన ఎన్టీఆర్.. వీడియో వైరల్

Nayanthara Blessed With Twins నయన తార విఘ్నేశ్ శివన్ జోడికి కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేశ్‌లకు జూన్ 9న వివాహాం జరిగింది. అయితే ఇంతలోనే కవలలు ఎలా పుట్టారంటూ కొంత మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2022, 08:43 AM IST
  • జూన్ 9న నయన్ విఘ్నేశ్ వివాహాం
  • కవలలకు జన్మనిచ్చిన నయన్
  • ఎన్టీఆర్ అదుర్స్ డైలాగ్ వైరల్
Nayanthara Blessed With Twins : నయనతారకు ట్విన్స్.. ముందే జాతకం చెప్పిన ఎన్టీఆర్.. వీడియో వైరల్

Nayanthara Blessed With Twins : నయనతార విఘ్నేశ్ శివన జోడికి కవల పిల్లలు పుట్టారనే వార్త ఒక్కసారిగా వైరల్ కాసాగింది. విఘ్నేశ్ శివన్ ఈ మేరకు పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. తమకు ట్విన్స్ పుట్టారంటూ, పండంటి బిడ్డలు పుట్టారని విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. అందులో నయన్, విఘ్నేశ్‌లు తమ బిడ్డల పాదాలను ముద్దాడుతూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం ఇంకోలా రియాక్ట్ అవుతున్నారు.

నయన్ విఘ్నేశ్‌కు పెళ్లి జూన్ 9న జరిగింది. అప్పుడే పిల్లలు ఎలా పుడతారని అడుగుతున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతోన్నారు. అయితే నయన్ సరోగసి ద్వారా పిల్లలను కనేసిందని అంటున్నారు. పెళ్లికి ముందే దీని మీద పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అందుకే పెళ్లిని హడావిడిగా కానిచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్టులో నయన్ కూడా చేరినట్టు అయింది.

 

ఇప్పుడు నయనతారకు కవలలు పుట్టడంతో అదుర్స్ సినిమా డైలాగ్ వైరల్ అవుతుంది.  ఎన్టీఆర్ అందులో నయన్ జాతకాన్ని ముందే చెప్పేశాడు. మచ్చల శాస్త్రం ప్రకారం నీకు కవలలు పుడతారు అని చెప్పేశాడు. ఇప్పుడు జనాలు ఆ డైలాగ్‌కు ప్రస్తుత పరిస్థితిని లింక్ చేసేస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్‌లతో వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు.

నయనతార ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్‌లో తేలిపోతోంది. అందరికీ థాంక్స్ అని చెబుతూ గాడ్ ఫాదర్ విజయంపై నయన్ స్పందించింది. ప్రస్తుతం నయన్ షారుఖ్ జవాన్ చిత్రంలోనూ నటిస్తోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ లేడీ సూపర్ స్టార్ మాత్రం ఫుల్ బిజీగానే ఉంటోంది.

Also Read : Nayanthara twin boys: కవల పిల్లలకు తల్లితండ్రులైన నయనతార-విగ్నేష్ శివన్.. పెళ్లైన నాలుగు నెలలకే!

Also Read : Dil Raju Temple: సొంత ఊరిలో దిల్ రాజు వెంకటేశ్వర స్వామి నిర్మాణం.. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News