NBK@50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..

NBK@50Years: తండ్రి ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.  క్రమశిక్షణతో పాటు ఎన్నో ఉన్నాయి. నటుడిగా 50 యేళ్లు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా స్టేజ్ పై భావోద్వేగానికి గురయ్యారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 2, 2024, 07:28 AM IST
NBK@50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..

NBK@50Years: నేను నా తండ్రి ఎన్టీఆర్ నుంచి నేర్చకున్నది యాక్టింగ్ మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయపాలన, సంస్కారం అని బాలయ్య చెప్పుకొచ్చారు.  అలాగే అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఎంతో నేర్చుకున్నాను. చలన చిత్ర పరిశ్రమలో మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంటుంది. సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో రాణించడానికి సహకరించిన  ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా సహచర నటీనటులు, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నాకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానని కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు బాలయ్య.  

అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, టెక్నికల్ బృందం, నా హాస్పిటల్ సిబ్బంది, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.  దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివర్లో బాలయ్య తన భార్య వసుంధరకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగించారు.

బాలయ్య విషయానికొస్తే.. ఎన్టీఆర్ నట వారసుడిగా 1974లో అన్నగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మకల’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో తాతమ్మ కలను నెరవేర్చే ముని మనవడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. అప్పటి నుంచి అప్రతిహతంగా నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్బుతమైన పాత్రల్లో నటించారు. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సోషల్, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, హార్రర్ ఇలా అన్ని జానర్స్ లో సినిమాలు చేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News