ఎన్టీఆర్ బయోపిక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త మహానటి సావిత్రి

ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రి పాత్రలో నటిస్తున్న కేరళ కుట్టి

Last Updated : Sep 22, 2018, 07:32 PM IST
ఎన్టీఆర్ బయోపిక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త మహానటి సావిత్రి

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు యదార్థగాథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సినిమా 'ఎన్టీఆర్'లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సావిత్రి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన మహానటి బయోపిక్ సినిమాలో అచ్చం సావిత్రిలాగే నటించి, ఆకట్టుకున్న కీర్తిసురేష్‌నే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో సావిత్రి పాత్ర కోసం తీసుకున్నట్టు గతంలో ప్రచారం జరిగింది. అయితే, కీర్తి సురేష్‌కి డేట్స్ కుదరకపోవడంతో తాజాగా ఆమె స్థానంలో కేరళ కుట్టి నిత్యామీనన్‌ని ఎంపిక చేసుకున్నారు. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్, సావిత్రి కలిసి నటించిన ''రక్త సంబంధం'' అనే అలనాటి హిట్ సినిమాపై ఎన్టీఆర్ బయోపిక్‌లో పలు దృశ్యాలు తెరకెక్కిస్తున్నారని, అందుకోసం నిత్యామీనన్ కూడా నిన్నటి నుంచే ఈ సన్నివేశాల చిత్రీకరణకు హజరువుతున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సుమంత్ మరో గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వర రావు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజైంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి స్పందన సైతం కనిపించింది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Trending News