Pawan Kalyan: నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఖుషీ

Pawan Kalyan Attends Niharika Wedding Celebration: టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు.

Last Updated : Dec 9, 2020, 09:53 AM IST
  • మెగా ఫ్యామిలీలో అట్టహాసంగా పెళ్లి సందడి
  • నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్
  • మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీఖుషీ
Pawan Kalyan: నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఖుషీ

Pawan Kalyan Attends Niharika Wedding Celebration: మెగా డాటర్, టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి (Niharika Konidela Wedding) వేడుకలకు అసలైన అందం నిన్న వచ్చిందట. కుటుంబసభ్యులు ఒకరోజు ముందుగానే రాజస్థాన్ చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు కుటుంబసభ్యులు మొత్తం ఉదయ్‌పూర్ చేరుకుని పెళ్లి వేడుకలు షురూ చేశారు. అయితే సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలతో మమైకమే ఉన్నారు. కానీ కుటుంబానికి సైతం సమయం కేటాయించాలి కదా.. అందుకే లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా నిహారిక వివాహ వేడుకలలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.
Photos: Niharika Wedding: రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి సందడి షురూ

తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి ఉన్న ఫొటోను మెగా బ్రదర్ నాగబాబు షేర్ చేసుకున్నారు. మెగా బ్రదర్స్ కలిశారు.. పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. అసలైన సంబరాలు ఇప్పుడు మొదలయ్యాయి అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫొటో సైతం ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిహారిక (Niharika Wedding), చైతన్యల వివాహ వేడుకతో మరోసారి మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణ కనిపిస్తోంది. 

Also Read : Chiranjeevi About Niharika Wedding: చిన్నారి నిహారిక అంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ 

 

కాగా, నేటి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో టాలీవుడ్ (Tollywood) నటి నిహారిక వివాహం ఘనంగా నిర్వహించేందుకు శుభ ముహూర్తం పెద్దలు నిశ్చయించారు. ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మెగా హీరోలు, కుటుంబసభ్యులు ఒకేచోట కనిపించడంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News