Kalki Ticket Rates: ఫ్యామిలీ ఆడియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కల్కి మూవీ టీమ్.. తగ్గనున్న సినిమా టికెట్ ధరలు..

Kalki Ticket Rates: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ చిత్రం రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అంతేకాదు పలు రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే.. ఈ సినిమాకు పెంచిన టికెట్ రేట్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా  చూడటానికి వెనకడుగు వేస్తున్నారు. వారికి ఊరట నిస్తూ ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించబోతున్నారు.

Last Updated : Jul 3, 2024, 08:47 AM IST
Kalki Ticket Rates: ఫ్యామిలీ ఆడియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కల్కి మూవీ టీమ్.. తగ్గనున్న సినిమా టికెట్ ధరలు..

Kalki Ticket Rates: ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో బెంబేలెత్తుతున్న జనాలకు కల్కి సినిమా కోసం పెంచిన ధరలతో సినిమాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే..ప్రీమియర్స్.. మొదటి మూడు రోజులు.. అభిమానులు పెరిగిన సినిమా టికెట్ రేట్స్ ను పెద్దగా పట్టించుకోకుండా ఈ సినిమాను ఆదిరించారు. కానీ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమాకు చాలా చోట్ల డ్రాప్స్ కనిపించాయి. దీనికి  కారణం పెరిగిన టికెట్ రేట్స్. అయితే.. తెలంగాణలో ఈ సినిమాకు 8 రోజులు పాటు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉండనున్నాయి. ఏపీలో 14 రోజులు పాటు వెసులుబాటు ఇచ్చారు.

అయితే అపుడపుడు వచ్చే ఇలాంటి సైన్స్ ఫిక్షన్, మైథాలజీ బేస్ మూవీలను పెద్ద తెరపై చూడాలని అందరు అనుకుంటారు. కానీ ఈ సినిమాకు హైదరాబాద్ సహా ఇతర మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ధర రూ. 450 నుంచి రూ. 500 వరకు ఉంది. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే.. రూ. 250 ఉంది. ఒక ఫ్యామిలీలో నలుగురు ఈ సినిమా చూడాలనుకుంటే మల్టీప్టెక్స్ లో రూ. 2 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంటర్వెల్ లో పాప్ కార్న్ .. రాను పోను ట్రాన్స్ పోర్ట్ వంటివి కలుపుకుంటే.. మరో ఐదరారు వందలు ఖర్చు అవుతుంది. అయితే సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం ఇందులో సగం ఖర్చు అవుతోంది.

ఒక కామన్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు ఈ టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా టికెట్ ధరలు తగ్గితే చూడాలనుకుంటున్నారు. వారి కోసం కల్కి మూవీ టికెట్స్ ను ఈ గురువారం కానీ శుక్రవారం నుంచి మల్టీప్లెక్స్ లో రూ. 250, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 150 చేయనున్నారట.  ఒకవేళ టికెట్ రేట్స్ తగ్గిస్తే .. చాలా మంది కామన్ లోయర్, మిడిల్ క్లాస్ పీపుల్ .. ఈ సినిమాను తమ ఫ్యామిలీతో కలిసి చూసే భాగ్యం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల రిపీట్ ఆడియన్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను మన పురాణాల ఇతిహాసాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ సినిమాను ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. భైరవగా.. కర్ణుడిగా రెండు పాత్రల్లో నటించాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’ పాత్రలో నటించాడు. కమల్ హాసన్..కలి పురుషుడి రూపమైన సుప్రీమ్ యాస్కిన్ రూల్ ప్లే చేసాడు. అటు దీపికా ..సుమతి పాత్రలో అలరించింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ. 600 కోట్ల గ్రాస్ కు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. టోటల్ రన్ లో రూ. వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News