Pushpa 2 Pre Release Event: ‘పుష్ప 2’ ఇంట్రడక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పించడం పక్కా.. మూవీపై హైప్ పెంచేసిన రాజమౌళి వ్యాఖ్యలు..

Pushpa 2 Pre Release Event: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రూల్  పార్ట్ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చేసిన పుష్ప టీమ్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 3, 2024, 01:05 AM IST
Pushpa 2 Pre Release Event: ‘పుష్ప 2’ ఇంట్రడక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పించడం పక్కా.. మూవీపై హైప్ పెంచేసిన రాజమౌళి వ్యాఖ్యలు..

Pushpa 2 Pre Release Event: పుష్ప పార్ట్ 1తో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందులో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ కృషికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. మొదటి పార్ట్ భారీ హిట్ నేపథ్యంలో రెండో పార్ట్ ను ఎంతో పకడ్బందీగా తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్. దాదాపు పుష్ప రెండు పార్టులకు ఐదేళ్ల సమయం పట్టింది. ఇప్పటికే పాట్నా, చెన్నై, ముంబై, కొచ్చిలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో రాజమౌళి పుష్ప 2 మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. పుష్ప 1 టైమ్ లో  బన్నీతో నార్త్ ఇండియాని వదలకు అని చెప్పాను.  అక్కడ నీకోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మూడేళ్ల  తర్వాత పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ వచ్చేసిందన్నారు. మాములుగా  ఏ సినిమా ఈవెంట్కైనా వెళ్ళినప్పుడు ఆ సినిమాకు ఉపయోగపడేలా ఏదైనా మాట్లాడుతాము.

కానీ పుష్ప 2 సినిమాకు అటువంటి అవసరం రాలేదన్నారు.  కాబట్టి ప్రేక్షకులతో  ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సుమారు రెండు మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప షూటింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు.  అక్కడ అల్లు అర్జున్ , సుకుమార్ తో మాట్లాడుతూ ఉండగా సుకుమార్ నాకు సినిమాలో ఒక సీన్ చూపించారు.  ఆ సీన్ పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్. అది చూస్తేనే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సినిమా ఎలా ఉండబోతుంది అనేది అర్ధమైందన్నారు. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ నుండి ఎంత మ్యూజిక్ చేయించుకోగలరు అంత చేయించుకోండన్నాను. ఇక డిసెంబర్ 4 సాయంత్రం నుండి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది  ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది. టీమ్ మొత్తానికి  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్షం కూడా పడుతుంది, ఇది కచ్చితంగా ఒక శుభ పరిణామమే అన్నారు.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News