Rashmika Stage Perfomance: పుష్ప ఈవెంట్‌లో స్టేజీపై డ్యాన్స్ చేసిన రష్మిక.. బ్లాక్ శారీలో సామి పాటకి స్టెప్పులు

Rashmika Mandanna dance at Pushpa event: 'పుష్ప' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా తన మాట, ఆటతో దుమ్ములేపారు. పుష్మ సినిమాలోని డైలాగ్‌తో పాటు 'సామీ... సామీ...' పాటకు స్టెప్పులేసి అభిమానులను హోరెత్తించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 11:24 AM IST
  • పుష్ప ఈవెంట్‌లో రష్మిక మందనా అదిరిపోయే పెర్ఫామెన్స్
  • డైలాగ్, డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేసిన రష్మిక
  • బన్నీ సార్ ఐలవ్యూ అంటూ మనసులో మాట బయటపెట్టేసింది
Rashmika Stage Perfomance: పుష్ప ఈవెంట్‌లో స్టేజీపై డ్యాన్స్ చేసిన రష్మిక.. బ్లాక్ శారీలో సామి పాటకి స్టెప్పులు

Rashmika Mandanna dance at Pushpa event: సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం పుష్ప సినిమా (Pushpa Movie) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పవర్ ప్యాక్డ్ మాస్ పెర్ఫామెన్స్‌ను ఎప్పుడెప్పుడు 70 ఎంఎం స్క్రీన్‌పై చూసేద్దామా అన్న ఉత్సుకతతో ఉన్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచి లేటెస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ వరకు పుష్పకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ హైప్‌ను నిలబెట్టుకునేలా... ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేలా పుష్ప సినిమా ఉండబోతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక నిన్నటి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ స్పీచ్, రష్మిక స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి.

స్టేజీపై రష్మిక (Rashmika Mandanna) మాట్లాడుతున్న సమయంలో పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పాలంటూ యాంకర్ సుమ కోరారు. దీంతో రష్మిక... 'హే.. ఛీ.. ఛీ.. నువ్వు నాకు నచ్చేదేంది... నేను చూల్లేదని ఓ పులుపెక్కి పోతాండవంట కదా...' అంటూ చిత్తూరు యాసలో డైలాగ్ అదరగొట్టారు. ఆ వెంటనే సుమ డైలాగ్‌తో సరిపెడితే కుదరదని... స్టెప్పులు కూడా వేయాలని పట్టుబట్టారు. దీంతో 'సామీ... సామీ...' పాటకు రష్మిక స్టేజీపై స్టెప్పులేశారు. వేసింది ఒక్క స్టెప్పే అయినప్పటికీ అభిమానులు ఫిదా అయిపోయారు. రష్మిక డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతకుముందు, రష్మిక మాట్లాడుతూ... పుష్ప (Pushpa Movie) రిలీజ్ అవనున్న డిసెంబర్ 17 నుంచి తగ్గేదేలే అని పేర్కొన్నారు. గీత గోవిందం ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ను చూసి ఆయనతో నటించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇప్పుడిలా శ్రీవల్లిగా అల్లు అర్జున్‌తో (Allu Arjun) కలిసి నటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు... బన్నీ సార్.. ఐలవ్యూ... థాంక్యూ సోమచ్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ విజిల్స్, కేకలతో హెరెత్తించారు. ఇక చిత్ర దర్శకుడు సుకుమార్ టాలెంట్ గురించి మాటల్లో చెప్పలేమన్న రష్మిక... ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Kashi Vishwanath Corridor: నేడు కాశీ విశ్వనాథ్ కారిడార్​ను ప్రారంభించనున్న ప్రధాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News