Ram Charan on Virat Kohli Biopic: విరాట్ లానే నాకు కూడా ఉంది.. కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా: రామ్ చరణ్

Ram Charan About Virat Kohli Biopic: రామ్ చరణ్‌ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించాలని ఉందనే కోరికను బయపెట్టేశాడు. విరాట్ కోహ్లీ బయోపిక్‌కు చాన్స్ వస్తే నటిస్తాను అని రామ్ చరణ్ అన్నాడు

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 09:30 AM IST
  • జాతియ స్థాయిలో రామ్ చరణ్ రచ్చ..
  • విరాట్ కోహ్లీ బయోపిక్‌ మీద కామెంట్..
  • ఇద్దరం కాస్త సేమ్‌ ఉంటామన్న చెర్రీ..
Ram Charan on Virat Kohli Biopic: విరాట్ లానే నాకు కూడా ఉంది.. కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా: రామ్ చరణ్

Ram Charan Interested to Work in Virat Kohli Biopic: రామ్ చరణ్ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కాంక్లేవ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. చెప్పిన విషయాలు, పంచుకున్న సంగతులు ఎంతగానో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడాడు. సల్మాన్ సినిమాలో సర్ ప్రైజ్ కూడా ఉంటుందని అన్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల గురించి కూడా మాట్లాడాడు. రాజమౌళి, ఎన్టీఆర్‌లతో ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. ఇక ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మీద స్పందించాడు.

స్పోర్ట్స్ డ్రామాలో నటించాలని ఉందని, అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్‌లో నటిస్తాను.. మేం ఇద్దరం చూడటానికి కాస్త ఒకేలా ఉంటాం.. మా గడ్డం ఒకేలా ఉంటుందని చమత్కరించాడు రామ్ చరణ్‌.. అతను ఎంతో ఇన్‌స్పైరింగ్ వ్యక్తి అని విరాట్ కోహ్లీ గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

ఇక బుచ్చిబాబు సానాతో చేయబోయే సినిమా గురించి ఆకాశమంత హైప్ ఇచ్చాడు. పాథ్ బేకింగ్ కారెక్టర్ అన్ని, రంగస్థలంను మించి ఉంటుందని, అది వెస్ట్రన్ ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుందని అన్నాడు. అంటే మళ్లీ ఆస్కార్ వరకు వెళ్తారా..? అని అంటే.. వెళ్లొచ్చు అని అన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేశాడు.

ఇక రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. ముందుగా ఎన్టీఆర్ నటిస్తాడని నాకు, నేను నటిస్తాను అని ఎన్టీఆర్‌కు చెప్పలేదు. ఇంటికి పిలిచాడు.. ఇంటికి వెళ్లే సరికి ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఇద్దర్నీ కూర్చోపెట్టి.. మీ ఇద్దరితోనూ సినిమా చేస్తున్నాను అని అప్పుడు ఆర్‌ఆర్ఆర్ గురించి చెప్పాడట. రాజమౌళి కాబట్టే తామిద్దరం సినిమాకు ఓకే చెప్పానని, అయితే మా ఫ్రెండ్ షిప్‌ను చూసే ఈ సినిమాను మాకు ఆఫర్ చేసి ఉంటాడని రాజమౌళి గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News