Ram Charan - Game Changer: దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' (RRR) మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ లెవల్‌కు ఎదిగాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి కంటే ముందు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' చిత్రం చేస్తున్నారు.ఈ మూవీల రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ఈ ఇయర్ లాస్ట్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'జరగండి' పాటను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక 'గేమ్ ఛేంజర్' మూవీ డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్ ఖరారైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఐదు భాషలకు కలిపి దాదాపు రూ. 100 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మొత్తం అన్ని భాషలకు సంబంధించిన దాదాపు రూ.50 కోట్లు పలికినట్టు సమాచారం. అంతేకాదు మ్యూజిక్ రైట్స్ సరేగమా వాళ్లు రూ. 25 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఈ రకంగా నాన్ థియేట్రికల్‌గానే నిర్మాతకు రూ. 175 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ దక్కడం మాములు విషయం కాదు.
#Jaragandi Song From #GameChanger Releasing Tomorrow 9AM pic.twitter.com/xRZaX3iiA5
— Milagro Movies (@MilagroMovies) March 26, 2024
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రతో పాటు ముఖ్యమంత్రి పాత్రకు మంచి స్కోప్ ఉందట. ఈ రోల్‌ను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో చచేస్తున్నారట. ఇప్పటికే శంకర్ వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్ మోహన్‌లాల్‌కు వినిపించాడట. ఆయన కూడా స్టోరీ నచ్చి ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్.. రామ్ నందన్ అనే IAS అధికారి పాత్రలో నటిస్తున్నాడట. ఈ క్యారెక్టర్ మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ స్పూర్తితో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే రోజున విడుదల చేయనున్నారు.
'గేమ్ ఛేంజర్' మూవీని దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ..గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ చేస్తూనే.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. మరోవైపు రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో 17వ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter