Dhamaka Collection : వంద కోట్ల ధమాకా.. రవితేజ మాస్ స్టామినా ఇదే

Dhamaka Enters in 100 Cr Club రవితేజ నటించిన ధమాకా సినిమా వంద కోట్ల క్లబ్బులోకి చేరింది. పద్నాలుగు రోజుల తరువాత ధమాకా ఈ ఫీట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా వంద కోట్ల గ్రాస్‌ను కొల్లగిట్టి మరోసారి మాస్ సినిమాల సత్తాను చాటింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 02:36 PM IST
  • బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేతోన్న ధమాకా
  • మాస్ సినిమాల సత్తా చాటిన రవితేజ
  • వంద కోట్ల క్లబ్బులోకి ధమాకా చిత్రం
Dhamaka Collection : వంద కోట్ల ధమాకా.. రవితేజ మాస్ స్టామినా ఇదే

Dhamaka Box Office Collection మాస్ మహారాజ రవితేజకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా సరైన సినిమా పడితే మాత్రం రవితేజ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తుంటాడు. అలానే చాలా ఫ్లాపుల తరువాత బలుపు వచ్చింది.. ఆ తరువాత రాజా ది గ్రేట్ వచ్చింది. రీసెంట్‌గా క్రాక్‌ సినిమా వచ్చింది. అయితే మధ్యలో ఖిలాడీ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ధమాకా అంటూ దుమ్ములేపేస్తున్నాడు.

రవితేజ బాక్సాఫీస్ వద్ద ధమాకాతో తన సత్తా చాటుతున్నాడు. రవితేజ తన కెరీర్‌లో మొదటి సారిగా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యాడు. వంద కోట్ల గ్రాస్‌తో ధమాకా సినిమా ఇంకా దూసుకుపోతోంది. ధమాకా సినిమా ఇప్పటికీ థియేటర్లో హల్చల్ చేస్తోంది. ధమాకా సినిమా పద్నాలుగు రోజుల్లో వంద కోట్ల గ్రాస్‌ రాబట్టేసింది. అలా మాస్ ఆడియెన్స్ సినిమాకు ఏ రేంజ్‌లో వసూళ్లను కురిపిస్తారో మరోసారి ధమాకా చిత్రం నిరూపించింది.

రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ చిత్రాలకు కాలం చెల్లిందని చెప్పే వారికి ధమాకా ఓ కనువిప్పులా అనిపిస్తుంది. మన వాళ్లు కొత్త సినిమాలను ఎంకరేజ్ చేస్తూనే ఇలాంటి రొటీన్ కమర్షియల్ చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, శ్రీలీల అందాలు, డ్యాన్సులు, పాటలు, కామెడీ ఇలా అన్నీ కూడా అందరికీ నచ్చేశాయి.

అందుకే ధమాకా సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. పోటీలో నిఖిల్ 18 pages సినిమా ఉన్నా కూడా  ధమాకా మాత్రం కలెక్షన్లలో దుమ్ములేపేస్తోంది. ధమాకా సినిమా ఇంకా ఓ వారం పాటు ఆడేలా ఉంది. సంక్రాంతి సినిమాలు పడే వరకు ధమాకా హవా తగ్గేలా కనిపించడం లేదు.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News