Mahesh Babu-Rajamouli Film: మహేష్ బాబు కోసం 2 కధలు రెడీ చేసిన రాజమౌళి

Rajamouli: ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకుడు రాజమౌళి అప్‌కమింగ్ సినిమా ఎవరితోననేది చర్చనీయాంశంగా మారిన నేపధ్యంలో..సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం రెండు కధలు సిద్దంగా ఉన్నాయంటున్నాడు రాజమౌళి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2022, 01:56 PM IST
Mahesh Babu-Rajamouli Film: మహేష్ బాబు కోసం 2 కధలు రెడీ చేసిన రాజమౌళి

Rajamouli: ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకుడు రాజమౌళి అప్‌కమింగ్ సినిమా ఎవరితోననేది చర్చనీయాంశంగా మారిన నేపధ్యంలో..సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం రెండు కధలు సిద్దంగా ఉన్నాయంటున్నాడు రాజమౌళి.

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ఆలస్యం కావడంతో..దర్శకుడు రాజమౌళి, అతని తండ్రి కే విజయేంద్రప్రసాద్‌లు కొన్ని కధాంశాలపై కసరత్తు చేశారని తెలుస్తోంది. ఈ కధలన్నీ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టు కోసమట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించాడు. 

ఆ రెండున్నర నెలల కాలంలో ఏ విధమైన కధాంశమైతే బాగుంటుందో అనేది ఆలోచించానంటున్నాడు రాజమౌళి. రెండు కధాంశాలపై పెద్దఎత్తున కసరత్తు చేశానని..రెండూ ఎక్సైటింగ్‌గానే ఉంటాయని..అందులో ఒకటి ఎంచుకుంటానంటున్నాడు. ఇంకా ప్రస్తుతం ఆ కధలు కేవలం ప్రారంభదశలోనే ఉన్నాయని..కానీ యాక్షన్, ఎడ్వెంచర్‌తో కూడిన వైవిద్యమైన సినిమాను అందిస్తానని మహేశ్ బాబు అభిమానులకు భరోసా ఇచ్చాడు రాజమౌళి. విలియమ్ వైలర్ 1959 సినిమా బెన్‌హర్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా రాజమౌళి చెప్పుకొచ్చాడు. తన అన్ని సినిమాలు ఎంతో కొంత ఆ సినిమా నుంచి ప్రభావితమయ్యాయన్నాడు. కేఎల్ నారాయణ నిర్మాతగా వహిస్తున్న సినిమాను రాజమౌళి ఈ ఏడాది చివరికి షూటింగ్ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. 

Also read: Ranbir Alia Wedding Date: రణ్ బీర్, అలియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేడుకకు తరలిరానున్న బాలీవుడ్ ప్రముఖులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News