బామ్మగా మారుతున్న సమంత ?

సమంత చేస్తో్న్న సరికొత్త ప్రయోగం 

Last Updated : Aug 20, 2018, 07:24 PM IST
బామ్మగా మారుతున్న సమంత ?

ఇటీవలే తన కొత్త సినిమా యు టర్న్ టీజర్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చిన అందాల తార సమంత అక్కినేని త్వరలోనే బామ్మ అవతారమెత్తనుంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేయనున్న కొత్త సినిమాలో సమంత ఓ బామ్మ పాత్ర పోషించనుంది. మిస్ గ్రానీ అనే ఓ కొరియన్ డ్రామా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనుంది నందిని రెడ్డి. వృద్ధురాలైన ఓ బామ్మ అనూహ్యంగా యువతిగా మారడమే ఈ సినిమా కథాంశం. ఒక విధంగా ఈ సినిమాకు హీరోయిన్ కూడా సమంతేనన్నమాట. గతంలో నందిని రెడ్డి తెరకెక్కించిన జబర్దస్త్ సినిమాలో సిద్ధార్థ్ సరసన సమంత జంటగా నటించింది. అయితే, ఆ సినిమా అట్టర్‌ఫ్లాప్ కావడమే కాకుండా దర్శకురాలు నందిని రెడ్డిని కాపీ రైట్స్ వివాదంలోకి నెట్టేసింది. బాలీవుడ్‌లో హిట్ అయిన బ్యాండ్ బాజా బారాత్ సినిమాను తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించారని ఆ చిత్ర నిర్మాతలు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. 

అలా జబర్దస్త్ నేర్పిన గుణపాఠంతో ఈసారి కొరియన్ సినిమా కాపీ రైట్స్ కొనుగోలు చేసి అధికారికంగానే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నందిని రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. 

Trending News