Sanjana Galrani, Ragini Dwivedi: డ్రగ్స్ కేసులో సంజన, రాగిణి ద్వివేదిల FSL report

Sanjana Galrani, Ragini Dwivedi drugs case: డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాగిణి ద్వివేది, సంజనల నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జరిపిన పరీక్షల్లో (FSL report) నిర్ధారణ కావడంతో ఆ ఇద్దరూ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2021, 05:33 PM IST
  • డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజన గల్రాని, రాగిని ద్వివేది.
  • శాండల్‌వుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ కేసులో FSL report
  • ఇద్దరు హీరోయిన్స్‌కి మరోసారి నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయిన పోలీసులు
Sanjana Galrani, Ragini Dwivedi: డ్రగ్స్ కేసులో సంజన, రాగిణి ద్వివేదిల FSL report

Sanjana Galrani, Ragini Dwivedi drugs case: డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానికి చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాగిణి ద్వివేది, సంజనల నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జరిపిన పరీక్షల్లో (FSL report) నిర్ధారణ కావడంతో ఆ ఇద్దరూ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఆ ఇద్దరు హీరోయిన్స్‌ని విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి నోటీసులు జారీ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. 

రాగిణి ద్వివేది, సంజన నుంచి తొలుత సేకరించిన బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అందులో ఫలితం ఎటూ తేలలేదు. దీంతో గతేడాది అక్టోబర్ నెలలో మరోసారి ఆ ఇద్దరు హీరోయిన్స్ వెంట్రుకలను నమూనాలుగా సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఈసారి ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదికలో ఈ ఇద్దరు హీరోయిన్స్ డ్రగ్స్ (Drugs case) తీసుకున్నట్లు తేలింది. 

Also read : Tuck Jagadish: టక్ జగదీష్ రిలీజ్ విషయంలో Nani కి నిర్మాతల మండలి సపోర్ట్

గతంలో అనేక సందర్భాల్లో ఈ ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు రాగా ఈ డ్రగ్స్ కేసు (Sanjana Galrani, Ragini Dwivedi drugs case) వారిని అటు కన్నడ, ఇటు తెలుగు సినీ పరిశ్రమలో మరింత అబాసుపాలయ్యేలా చేసింది.

Also read : Maestro trailer: ఆసక్తిరేకెత్తిస్తోన్న మాస్ట్రో ట్రైలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News