Kushi Release Date : సమంత విజయ్ వచ్చేది ఎప్పుడంటే?.. ఖుషి రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda Kushi Release Date విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో రావాల్సిన ఖుషి సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా అప్డేట్‌ను ఇచ్చారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 04:17 PM IST
  • సమంత విజయ్‌ల ఖుషి సినిమా అప్డేట్
  • ఖుషి విడుదలయ్యేది ఎప్పుడంటే?
  • ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేసిన యూనిట్
Kushi Release Date : సమంత విజయ్ వచ్చేది ఎప్పుడంటే?.. ఖుషి రిలీజ్ డేట్ ఇదే

Samantha Kushi Release Date సమంత, విజయ్, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతోన్న ఖుషి సినిమా అప్డేట్ ఇప్పుడు వచ్చింది. సమంతకు మయోసైటిస్ రావడంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలు ఆగిపోయింది. మళ్లీ ఈ మధ్యే సమంత సెట్స్‌లోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు ఖుషి సినిమా అప్డేట్‌ను మేకర్లు వదిలారు. ఈ సినిమా తన రిలీజ్ డేట్‌ను బ్లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

సమంతకు అనారోగ్య సమస్యలు రావడంతో ఖుషి ఇంత ఆలస్యం అయింది. లేకపోతే ఈ పాటికి సినిమా కూడా రిలీజ్ అయ్యేది. గత ఏడాది ఆగస్ట్ నుంచి సమంత షూటింగ్‌లకు దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత ఇంటికే పరిమితమైంది. షూటింగ్‌లు కాదు కదా? కనీసం బయటకు రాలేదు. తన మొహం కూడా ఎవ్వరికీ చూపించలేదు.

అలా మయోసైటిస్ వల్ల సమంత బాధపడింది. సమంత వల్ల ఖుషి టీం ఎంతో వేదనకు గురైంది. దీంతో సినిమా షూటింగ్‌ను మొత్తంగా ఆపేశారు. ఇక శివ నిర్వాణ వేరే సినిమాను చేసుకుంటాడనుకునే సమయంలోనే సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చింది. అలా ఫిబ్రవరి ఎండింగ్, మార్చి ప్రారంభంలోనే మళ్లీ ఖుషి సినిమా 
సెట్స్ మీదకు వెళ్లింది.

ఇప్పుడు చకచకా షూటింగ్ జరుగుతోంది.అందుకే ఇంత ధైర్యంగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మరి ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా? మధ్యలో ఏమైనా జరిగి ఆలస్యం అవుతుందా? అన్నది చెప్పలేం. అసలే సమంత ఇప్పుడు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌తోనూ బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఆ వెబ్ సిరీస్‌కు కూడా సమంత డేట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

 

సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఏప్రిల్ 14న ఈ సినిమా రాబోతోండటంతో పాన్ ఇండియన్ ప్రమోషన్స్‌లో బిజీగా తిరుగుతోంది. నేడు ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News