Abhishek Bachchan Prabhas : ప్రభాస్ కంటే నేనే పెద్ద.. అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్

Abhishek Bachchan on Prabhas అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ ఫుల్ బిజీగా ఉండే అభిషేక్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తూ ఉంటాడు. నెటిజన్ల ట్రోలింగ్‌కు రియాక్ట్ అవుతుంటాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 12:50 PM IST
  • నెట్టింట్లో అభిషేక్ బచ్చన్ సందడి
  • ప్రభాస్ మీద నెటిజన్ కామెంట్
  • నెటిజన్‌కు అభిషేక్ కౌంటర్లు
Abhishek Bachchan Prabhas : ప్రభాస్ కంటే నేనే పెద్ద.. అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్

Abhishek Bachchan on Prabhas సోషల్ మీడియాలో కొంత మంది తారలు ఎంతో సరదాగా ఉంటారు. ట్రోలింగ్‌ను కూడా లైట్ తీసుకుంటారు. జనాల చేసే విమర్శలను అంతగా పట్టించుకోరు. కానీ ఒక్కోసారి హద్దులు దాటే కామెంట్లు వచ్చినప్పుడు మాత్రం స్పందిస్తుంటారు. అభిషేక్ బచ్చన్ అలాంటి వాడే. తన వరకు ఏమీ అనకపోయినా తన ఫ్యామిలీ మీద ట్రోలింగ్ జరిగితే రియాక్ట్ అవుతుంటాడు.

ఐశ్వర్య రాయ్, ఆరాధ్య బచ్చన్ మీద జరిగే ట్రోలింగ్‌ మీద సీరియస్ అవుతుంటాడు. అభిషేక్ బచ్చన్ మీద ఎప్పుడూ వినిపించే విమర్శ ఒకటి ఉంటుంది. తండ్రి వారసత్వాన్ని, లెగసీని కంటిన్యూ చేయలేకపోతోన్నాడని అందరూ అంటుంటారు. కానీ అభిషేక్ హీరోగా సక్సెస్ కాలేకపోయినా మంచి నటుడిగా మాత్రం పేరు సంపాదించుకున్నాడు.

ఓటీటీ కంటెంట్‌లకు అభిషేక్ పర్ఫెక్ట్ చాయిస్‌గా ఉంటాడు. బ్రీత్ అంటూ సాగే వెబ్ సిరీస్‌లో అభిషేక్ అదరగొట్టేశాడు. ఈ మధ్యే రెండో సీజన్ వచ్చింది. నిత్యా మీనన్, అభిషేక్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అభిషేక్ సోషల్ మీడియాలో వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

 

ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ఎవరు? అని ఓ మీడియా సంస్థ ట్వీట్ వేసింది. దానికి ఓ నెటిజన్ వింతగా సమాధానం ఇచ్చాడు. 6.2 ఫీట్, 95 కిలోలతో ప్రభాస్ ఉంటాడేమో అని కౌంటర్ వేశాడు. దీనికి అభిషేక్ స్పందించాడు. నేను 6.3 ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. అంటే తాను ప్రభాస్ కంటే పెద్ద అని చెప్పకనే చెప్పేసుకున్నాడు. ఇక అభిషేక్ స్పాంటేనిటీని చూసి అంతా నవ్వేసుకుంటున్నారు.

ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్లతోనూ క్లోజ్‌గానే ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అందులోంచి మూడు చిత్రాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సలార్, మారుతి సినిమా, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి.

Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News