నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం

గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల చనిపోయారు. అంతలోనే Anchor Suma Kanakala కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.

Updated: Apr 6, 2020, 04:58 PM IST
నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, నటి శ్రీలక్ష్మీ కనకాల నేడు మరణించారు. యాంకర్ సుమకు ఆడపడుచు శ్రీలక్ష్మీ. సీనియర్ నటుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల. ఆమె పలు సీరియల్స్‌లో నటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న శ్రీ లక్ష్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.క్యాన్సర్‌తో పోరాడుతూ చిన్న వయసులోనే కన్నుమూయడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. Photos: సామాన్యుడి నుంచి మోదీ వరకు చిరుదివ్వెలు

నటి శ్రీ లక్ష్మీ ఈమె ఆయుర్వేద వైద్య నిపుణురాలు. ఆమె భర్త పెద్ది రామారావు జర్నలిస్టుగా చేస్తున్నారు. వీరికి సంతానం ఇద్దరు అమ్మాయిలున్నారు. రాజీవ్‌తో పెళ్లికి ముందే యాంకర్ సుమ, శ్రీలక్మీకి పరిచయం ఉంది. ఇద్దరు ఆ సమయంలో సీరియల్స్‌లో నటించేవారు. రాజీవ్, సుమ ప్రేమ విషయంలో కూడా శ్రీలక్ష్మీ కాస్త హెల్ప్ చేయడం తెలిసిందే.   ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

వాళ్లను వదలను, కంప్లైంట్ ఇస్తా: జబర్ధస్త్ కమెడియన్

కాగా, గతేడాది తండ్రి దేవదాస్ కనకాల కాలం చేయగా, నేడు సోదరి శ్రీలక్ష్మీ చనిపోవడంతో రాజీవ్ కనకాల, సుమ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. నటి శ్రీలక్ష్మీ మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. రాజీవ్ కనకాల, సుమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone