Best Brain Food: విద్యార్థులంటే ఎదిగే వయసు. చదువలతో కుస్తీ పడే ఈ వయసులో మెదడు చురుగ్గా పనిచేస్తేనే బాగా చదువుకోగలరు. చదివింది బాగా గుర్తుంచుకోగలరు. కాబట్టి విద్యార్థులకు సంపూర్ణ పోషకాహారం చాలా అవసరం. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉండాలంటే డైట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నట్స్ అండ్ సీడ్స్ :
నట్స్ అండ్ సీడ్స్‌లో విటమిన్ ఇ, జింక్, మెగ్నేషియం, కాపర్, ఐరన్, హెల్తీ ఫ్యాట్, ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. విద్యార్థులు వీటిని స్నాక్‌గా తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం నట్స్ అండ్ సీడ్స్ మెదడు చురుగ్గా ఉండటంలో దోహదపడుతాయి. వాల్‌నట్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తితో పాటు నాన్ వెర్బల్ రీజనింగ్ వంటి స్కిల్స్ పెరుగుతాయని చెబుతారు.
ఎగ్స్
ఎగ్స్ మీ మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా దోహదపడుతాయి. ఇందులో బీ6, బీ12, ఫొలెట్, కొలిన్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే సెలేనియం, లుటెన్, కారోటెనాయిడ్ పిగ్మెంట్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఎగ్స్‌ను మల్టి విటమిన్స్ అంటారు. మానసిక ఆరోగ్యానికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. ఎగ్ ఎల్లో, వైట్ రెండూ తీసుకున్నప్పుడే సంపూర్ణ పోషకాలు లభిస్తాయి.
ఫ్యాటీ ఫిష్
చేపల్లో ఒమెగా 3s పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. చేపలు తరచూ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
బెర్రీ అండ్ బీట్స్
బెర్రీలు, దుంపల ద్వారా శరీరానికి నైట్రిక్ యాక్సైడ్ అందుతుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. అంతేకాదు,రక్త ప్రసరణకు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదపడుతుంది. విద్యార్థులు మీల్స్‌తో పాటు రోస్టెడ్ బీట్స్ లేదా బీట్స్ జ్యూస్ తీసుకుంటే ఎనర్జిటిక్‌గా ఉండటంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
వెజిటేబుల్స్
గ్రీన్ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ డైట్‌లో గ్రీన్ వెజిటేబుల్స్ చేర్చుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆకు కూరలు, బ్రకోలీ, పెప్పర్స్ , కొత్తిమీర వంటి వాటిని సలాడ్స్ రూపంలో లేదా మీల్స్ రూపంలో తీసుకుంటే విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతాయి.
Also Read : 'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ
Also Read: Brahmastra Twitter Review : బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook