Diabetes Symptoms: మధుమేహం అనేది జీవనశైలి మార్పుల కారణంగా వచ్చే వ్యాధి. ఆధునిక జీవన సౌదీని అనుసరించడం వల్ల సులభంగా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వ్యాధి వచ్చిన తర్వాత అధిక రక్తపోటు వంటి వ్యాధులు కూడా రావచ్చు. శరీరంలో ఇన్సులిన్ పత్తులలో మార్పులు వచ్చి రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల ఈ వ్యాధి తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఇన్సులిన్ పరిమాణాలను ప్రతిరోజు పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామందిలో ప్రస్తుతం మధుమేహం సమస్యలు ఉన్న వారు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ సమస్యను సులభంగా తెలుసుకోవడానికి శరీరంలో వచ్చే మార్పులను గమనించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఈ లక్షణాలున్న వారు జాగ్రత్తగా ఉండాలి:
అరచేతిలో దురద:
రక్తంలో చక్కెర పరిమాణాలు రెండు వందల కంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నవారికి అరచేతిలో దురద వంటి చిన్న చిన్న లక్షణాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అయితే చర్మం పొడిగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేతుల్లో కాళ్లలో దూరంగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేళ్ళలో దృఢత్వం పెరగడం:
తీగ మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు వేళ్లలో దృఢత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొందరిలో బొటనవేలు పనిచేయకుండా కూడా పోతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గోళ్ళలో మార్పు:
రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చేతివేళ్ల గోళ్ళైతే పసుపు రంగు లేదా ఇతర రంగులోకి మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీ శరీరంలో ఏర్పడితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్
Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి