Hair Fall Problem: మధుమేహం పెరిగితే జుట్టు ఎందుకు రాలుతుంది, ఎలా చెక్ పెట్టాలి

Hair Fall Problem: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. లైఫ్‌స్టైల్ సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య వెంటాడుతోంది. మధుమేహం క్రమంగా శరీరంలో ఇతర సమస్యలకు దారి తీస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2023, 07:32 PM IST
Hair Fall Problem: మధుమేహం పెరిగితే జుట్టు ఎందుకు రాలుతుంది, ఎలా చెక్ పెట్టాలి

Hair Fall Problem: దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి మధుమేహం. దేశంలో ఇప్పటికే లక్షలాదిమంది మధుమేహం వ్యాధి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించలేకపోతే కిడ్నీ గుండె, కంటి చూపు ఇతరత్రా అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. 

మధుమేహం వ్యాధి పూర్తిగా జీవనశైలి ఆధారితమైంది. అందుకే నియంత్రణ కూడా లైఫ్‌స్టైల్ సక్రమంగా మార్చుకోవడం ద్వారా చేయవచ్చు. మధుమేహం తీవ్రమైతే హార్డ్ ఎటాక్,  కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్య అధికమౌతుంది. రక్తంలో చక్కెరను గ్లూకోజ్‌గా, గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్‌గా మారే ప్రక్రియకు ఇన్సులిన్ దోహదమౌతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిలో సమస్య ఏర్పడితే చక్కెర గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్‌గా మారే ప్రక్రియలో ఆటంకం ఏర్పడి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇదే మదుమేహం. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేది పాంక్రియాస్. అందుకే పాంక్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి. చెడు ఆహారపు అలవాట్లు పాంక్రియాస్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

శరీరంలో మధుమేహం తీవ్రత పెరిగినప్పుడు లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడి జుట్టు రాలుతుంటుంది. మధుమేహం కారణంగా రక్త ప్రసరణలో ఇబ్బంది తలెత్తుతుంది. దాంతో కేశాలకు రక్త ప్రసరణ జరగక అవి కాస్తా బలహీనంగా మారి రాలిపోతుంటాయి. కొత్తగా కేశాలు రావడం జరగదు. ఎందుకంటే స్కాల్ప్‌లో రక్త నాళాల వరకూ రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. దాంతో హెయిర్ ఫోలికల్స్ అనారోగ్యమౌతాయి. ఫలితంగా జుట్టు కుదుళ్లు బలహీనమై జుట్టు రాలుతుంటుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఈ సమస్య అధికమౌతుంది. 

జుట్టు రాలడాన్ని తగ్గించాలంటే ముందుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచాలి. దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి. పౌష్ఠికాహారం ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్స్, చక్కెరకు పూర్తిగా దూరం పాటించాలి. లీన్ ప్రోటీన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి. 

Also read: Health Benefits: బంగాళదుంప డైట్‌లో ఉంటే చాలు గుండెపోటు, కొలెస్ట్రాల్, మలబద్ఖకం సమస్యలకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News