Liver Swelling: కాలేయంలో కొలెస్ట్రాల్ పెరగడం సహాజమైనప్పటికీ..కొంతమందిలో వాపు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా మరికొంతమందిలో చెడు కొవ్వు కూడా అధిక పరిమాణంలో పేరుకుపోతోంది. దీనినే వైద్యులు ఫ్యాటీ లివర్ సమస్యగా పిలుస్తారు. కాలేయం వాపు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యాధి కారణంగా చాలా మందిలో ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్ వినియోగించాల్సి ఉంటుంది.
కాలేయ మంట, వాపు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు యాపిల్ సైడర్ వెనిగర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కాలేయాన్ని నిర్విషీకరణ చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం మీరు ప్రతి రోజు 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
నిమ్మ రసంలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా కాలేయ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు కాలేయ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
పసుపు నీరులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో బయోయాక్టివ్ సమ్మేళనం కూడా లభిస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో పసుపు కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కాలేయం వాపును తగ్గించేందుకు గ్రీన్ టీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ గ్రీన్ టీని తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి