అవిశ్వాసానికి మా మద్దతు ఉండబోదు

ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికార, విపక్ష పార్టీలు ఇచ్చే అవిశ్వాస నోటీసుకు ఏఐఏడీఎంకే పార్టీ మద్దతు ప్రకటించబోము అని తెలిపింది.

Last Updated : Mar 17, 2018, 12:41 PM IST
అవిశ్వాసానికి మా మద్దతు ఉండబోదు

ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికార, విపక్ష పార్టీలు ఇచ్చే అవిశ్వాస నోటీసుకు ఏఐఏడీఎంకే మద్దతు ప్రకటించబోమంది. తాము బీజేపీ వైపు ఉంటామన్న నేతలు.. అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్లు అంతకు ముందు ప్రకటించిన కేసీ పళనిస్వామిని అధికార ప్రతినిధి పదవి నుండి తొలగించామన్నారు. అయితే తన తొలిగింపు ప్రజాస్వామ్య విరుద్ధమని, తనను తొలగించడానికి వివరణ ఇవ్వలేదని పళనిస్వామి పేర్కొన్నారు.

అంతకుముందు.. కావేరీ జలాల విషయంలో కేంద్రం విఫలమైంది. అందుకే టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పార్టీల అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు.

ఒకవైపు ఎన్డీఏ నుండి వైదొలిగాక.. తెదేపా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విపక్షాలను కోరుతుండగా.. మరోవైపు జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అవిశ్వాసానికి మద్దతు కూడగడుతోంది. ఏఐఎంఐఎం పార్టీ సభ్యులు కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే అవిశ్వాసానికి తమ మద్దతుగా ఉంటుందన్న  టీఆర్ఎస్.. తెదేపా నోటీసుకు మద్దతు ఇవ్వాలా? లేక వైసీపీ నోటీసుకు మద్దతు ఇవ్వాలా? అనేది శనివారం వెల్లడిస్తుంది.

Trending News